కోడి కొంప ముంచిన కరోనా

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీనిబారిన ఇప్పుడు మాంసాహారం వచ్చి చేరింది. ఒక్క మనిషిని తప్ప అన్ని జీవులను భుజించే చైనీయుల ఆహారపు అలవాట్లే కరోనా కు [more]

Update: 2020-02-29 18:29 GMT

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీనిబారిన ఇప్పుడు మాంసాహారం వచ్చి చేరింది. ఒక్క మనిషిని తప్ప అన్ని జీవులను భుజించే చైనీయుల ఆహారపు అలవాట్లే కరోనా కు కారణం అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నడుస్తుంది. మాంసాహారం అత్యంత ప్రమాదామని చికెన్, మటన్ జోలికి పోవొద్దంటూ రకరకాల ప్రచారాలు ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తున్న ప్రజలు ఇప్పుడు మాంసాహారం అంటేనే హడలి పోతున్నారు. కోడి గుడ్డు ల అమ్మకాలు పడిపోయాయి. దాంతో మటన్, చికెన్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. మాంసాహారం లో ఒక్క చేపలకు మాత్రమే ఇంకా డిమాండ్ వుంది.

ఢమాల్ మని పడిపోయిన ధరలు …

ప్రస్తుతం కేజీ కోడి మాంసం 40 రూపాయల నుంచి 50 రూపాయలకు దిగిపోయింది. మటన్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. దాంతో పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభం లో పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఆధారపడిన పౌల్ట్రీ కి తగిలిన దెబ్బ ప్రభుత్వానికి సోకింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు తెలంగాణ సర్కార్ అయితే చికెన్ తినండి అనే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అపోహలు వీడాలంటూ టి మంత్రి కెటిఆర్ స్వయంగా చికెన్ బ్రాండ్ అంబాసిడర్ గా మరాలిసి వచ్చింది. హీరోయిన్ రష్మిక వంటివారు సైతం వేదికలు ఎక్కి చికెన్ తింటూ ఫోజులు ఇవ్వలిసి వస్తుంది. చికెన్ తినండి ఏమి కాదు తప్పుడు ప్రచారాలు నమ్మకండి అంటూ అంతా పిలుపునిస్తున్నారు. మొత్తానికి కరోనా వైరస్ కోళ్లపరిశ్రమ కొంపముంచిందనే చెప్పాలి.

Tags:    

Similar News