కరోనా నుంచి అవే కాపాడుతున్నాయట …?

కరోనా పేరు వినపడిన వెంటనే ప్రపంచం మొత్తం భారత్ వైపే చూశాయి. ముఖ్యంగా పేదరికం తో ఉండే దేశాల పరిస్థితి ఇక ఇంతే సంగతి అని లెక్కేశాయి [more]

Update: 2020-08-30 17:30 GMT

కరోనా పేరు వినపడిన వెంటనే ప్రపంచం మొత్తం భారత్ వైపే చూశాయి. ముఖ్యంగా పేదరికం తో ఉండే దేశాల పరిస్థితి ఇక ఇంతే సంగతి అని లెక్కేశాయి కూడా. అయితే చిత్రంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ తీవ్రత కొనసాగినట్లు భారత్ మరియు ఇతర పేద దేశాల్లో కనిపించలేదు. అయితే విజృంభణ కొనసాగుతున్నా ప్రపంచ దేశాల్లో ఉన్న తీవ్రత తో పరిగణిస్తే ఇది నామమాత్రమే. 130 కోట్ల జనాభా వున్న దేశంలో ముఖ్యంగా వైద్య సదుపాయాలు, అత్యాధునికంగా లేని భారత్ లో కరోనా ఎంట్రీ ఇవ్వగానే దేశం వణికింది. అయితే చిత్రంగా ముంబాయి లోని ధారవి వంటి లక్షల మంది నివశించే ధారవి వంటి చోట కూడా వైరస్ కంట్రోల్ లో వుంది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తో సహా అంతా ఆశ్చర్య పోయారు.

పరిశోధనల్లో ఫలితాలు ఇవి …

అసలు ఇలాంటి ప్రాంతాల్లో ఊహకు అందని విధంగా కరోనా వైరస్ నీరస పడటం వెనుక కారణాలపై ఆసియా ఫసిఫిక్ పబ్లిక్ ఆఫ్ జనరల్ అధ్యయనం చేపట్టింది. తన జనరల్ లో ఈ కారణాలను విశ్లేషించారు. మంగళూరు, ఢిల్లీ కి చెందిన ప్రముఖ వైద్యులు ఈ అధ్యయనంలో వివిధ కోణాలను పరిశీలించారు. గాలి, వెలుతురు, చక్కగా లభించడం ఎసి లు వంటి వి అందరు వాడుకునే అవకాశం పేదరికం కారణంగా లేకపోవడం ప్రధాన అంశాలు అని వీరు తమ జర్నల్ లో వెల్లడించారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో పౌరులు నిరంతరం ఏసీలు తో బాటు పబ్ లు బీచ్ లతో సామాజిక దూరాలు కూడా కనీసం పాటించకపోవడం తో వైరస్ వీర విజృంభణ జరిగిందని అంచనాకు రావడం విశేషం.

Tags:    

Similar News