మరో వారం….నిర్బంధం తప్పదు…?
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ కి వైద్యపరంగా పూర్తిస్థాయిలో లేదు. ఒకేసారి లక్షలమంది వైరస్ మహమ్మారి బారిన పడితే కాపాడే సౌకర్యాలు మనదేశంలో ఏ మాత్రం [more]
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ కి వైద్యపరంగా పూర్తిస్థాయిలో లేదు. ఒకేసారి లక్షలమంది వైరస్ మహమ్మారి బారిన పడితే కాపాడే సౌకర్యాలు మనదేశంలో ఏ మాత్రం [more]
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ కి వైద్యపరంగా పూర్తిస్థాయిలో లేదు. ఒకేసారి లక్షలమంది వైరస్ మహమ్మారి బారిన పడితే కాపాడే సౌకర్యాలు మనదేశంలో ఏ మాత్రం లేవు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఈ విషయంలో గజ గజ వణికిపోతున్నాయి. నిన్న మొన్నటివరకు కరోనా ప్రభావిత దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్న యుఎస్ ఇప్పుడు మూడో స్థానంలోకి వెళ్లడంతో అగ్రరాజ్యంలో ప్రజల్లో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతుంది. చైనా కరోనా కట్టడిలో అవలంభించిన విధానాలు మిగిలిన దేశాల్లో అత్యంత కష్టంతో కూడినవి. దాంతో కిం కర్తవ్యం అనే ది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. కరోనా కు మందు రెడీ అయిపోతుందని అమెరికా అధ్యక్షుడు పదేపదే చెబుతున్నా అది అందరికి అందుబాటులోకి రావడానికి చాలాకాలం పట్టనుంది.
భారత్ చర్యలను ప్రశంసించిన ప్రపంచం …
భిన్న మతాలు, కులాలు, భాషలతో ఉండే భారత్ లోకి కరోనా రక్కసి ప్రవేశిస్తే కంట్రోల్ చేయడం అయ్యే పని కాదన్నది ప్రపంచం చెప్పిన మాట. కానీ విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు అంతా సంఘటితం అయ్యే తీరును జనతా కర్ఫ్యూ రూపంలో దేశ వాసులు చేసి చూపించారు. భారత్ లో జరిగిన ఈ ఒక్కరోజు కార్యక్రమం అద్భుతంగా విజయం సాధించడం పట్ల అన్ని దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజల్లో చైతన్యం నింపి స్వీయ నిర్బంధం వారే విధించుకునేలా చేయడం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టడం అందరికి స్ఫూర్తిని ఇచ్చింది.
మూడో దశకు చేరకుండా…
ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో రెండో దశలో ఉన్న భారత్ ఎట్టి పరిస్థితుల్లోకి మూడో దశకు చేరకూడదని దేశవాసులు సంకల్పం వహించారు. దానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుడితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి జై జై భారత్ అని నినదిస్తే అదే స్థాయిలో ప్రజలు క్రమశిక్షణతో మద్దతు పలికి భావి యుద్ధంలో విజయం సాధించేందుకు కదిలారు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే స్వీయ నిర్బంధమే నివారణ మంత్రంగా పాటించడం ఇప్పుడు మొదలైంది. ఇదే మరో వారం పాటు దీక్షగా చేస్తే మంచి ఫలితాలే దేశంలో కనిపిస్తాయి.