బ్రదర్స్ సైలెంట్.. . టీడీపీపై ఎఫెక్టేనా ?
చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పారు దామచర్ల జనార్దన్. ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా [more]
చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పారు దామచర్ల జనార్దన్. ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా [more]
చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో తిప్పారు దామచర్ల జనార్దన్. ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన హవా సాగించారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు.. దామచర్ల సత్య కూడా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగానే కాకుండా సొంత నియోజకవర్గం కొండపిలో ఎమ్మెల్యే స్వామిని పక్కన పెట్టేసి రాజకీయం చేశారు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక దామచర్ల సోదరులు ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. ఈ సోదరులు గత రెండేళ్లుగా ఏమయ్యారు ? ఎక్కడున్నారు ? అనే సందేహాలు పార్టీ నేతల్లోనే చర్చకు వస్తున్నాయి. జిల్లాలో నాలుగు స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది.
ఓడిన తర్వాత..?
అయితే జిల్లా కేంద్రమైన ఒంగోలులో దామచర్ల జనార్థన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన ఏకంగా ముఖం చాటేయడంతో ఇప్పుడు దామచర్ల గురించిన వార్తలు.. వ్యాఖ్యలు కూడా వినిపించడంలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ది చేసిన ఆయన పార్టీనేతగా..జిల్లా చీఫ్‌గా పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం.. అనే రెండు పాత్రల్లోనూ ఆయన ఒకరకంగా సక్సెస్ అయ్యారు. అయితే జిల్లా పార్టీలో ఉన్నది ఉన్నట్టు అధిష్టానంకు వివరించడంలో ఆయన నొప్పింపక, తానొప్పక చందంగా వ్యవహరించడం పార్టీలోనే కొందరికి నచ్చలేదు.
అంచనా వేయడంలో….?
ఇక ఎన్నికల తర్వాత కూడా.. నేతల పరిస్థితులను అంచనా వేయడంలోనూ.. దామచర్ల జనార్ధన్ విఫలమయ్యారనే వాదన ఉంది. అందుకే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించినప్పుడు చంద్రబాబు దామచర్లను పక్కన పెట్టేశారు. పేరుకు ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టినా జిల్లాలో ఆయన హవాకు చెక్ పెట్టేశారనే చెప్పాలి. ఇక ప్రతిష్టాత్మకమైన ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలను ఆయన పూర్తిగా వదిలేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వెళ్లి హైదరాబాద్‌లో కూర్చోవడంతో చాలా కేడర్‌కు ఆయన దూరమైపోయారు. అందుకే చంద్రబాబు కూడా స్థానికంగా ఆయన పార్టీ కార్యక్రమాలను నడిపించలేరనే డిసైడ్ అయ్యి రాష్ట్ర స్థాయి పదవితో ఉత్సవ విగ్రహంగా మార్చేశారు.
పార్టీ అధికారంలో ఉండగా?
ఇక పార్టీ అధికారంలో ఉండగా కొండపి నియోజకవర్గంలో ప్రభుత్వం అంటే దామచర్ల సత్య… సత్య అంటేనే కొండపి ప్రభుత్వం అన్నట్టుగా ఉండేది. అక్కడ ఎమ్మెల్యే స్వామి మాట ఎప్పుడూ వినిపించేదే కాదు. అధికారులు ఎవరైనా సరే సత్యకు సలాం కొట్టేవారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ సత్య పార్టీ యువనేతల్లో ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యారు. అటు అన్న ఎమ్మెల్యేగా ఉన్న ఒంగోలులోనూ తన హవా చెలాయించేవారు. అలాంటి సత్య పార్టీ ఓడిపోయాక పార్టీలో యాక్టివ్‌గా ఉండడం లేదు. మధ్యలో దర్శికి ఇన్‌చార్జ్‌గా ఆయన పేరు వినిపించింది.. అక్కడ కొత్త ఇన్‌చార్జ్ వచ్చారు. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గానికి కూడా ఇన్‌చార్జ్‌గా సత్య పేరు నానుతోంది. ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన దామచర్ల సోదరులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారన చెప్పాలి.