ఓటమి ముందుగానే డిసైడ్ అయిందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి ముందుగానే డిసైడ్ అయిందా? అంటే అవుననే అంటున్నారు. అత్యధిక శాతం అమెరికన్లు ట్రంప్ మాటలను విశ్వసించకపోవడమే దీనికి కారణమంటున్నారు. ట్రంప్ [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి ముందుగానే డిసైడ్ అయిందా? అంటే అవుననే అంటున్నారు. అత్యధిక శాతం అమెరికన్లు ట్రంప్ మాటలను విశ్వసించకపోవడమే దీనికి కారణమంటున్నారు. ట్రంప్ [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి ముందుగానే డిసైడ్ అయిందా? అంటే అవుననే అంటున్నారు. అత్యధిక శాతం అమెరికన్లు ట్రంప్ మాటలను విశ్వసించకపోవడమే దీనికి కారణమంటున్నారు. ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని, క్షణక్షణానికి ఆయన మూడ్ మారుతుందంటున్నారు అత్యధిక శాతం అమెరికన్లు. అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో వచ్చే నవంబరు నెల 3వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున ట్రంప్, డెమొక్రాట్ల తరుపున బో బైడెన్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
హోరాహోరీగా ప్రచారం….
అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష్య ఎన్నికల హోరాహోరీ ప్రచారం జరుగుతుంది. ట్రంప్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కరోనా వైరస్ ఆయన పాలిట శాపంగా మారనుందంటున్నారు. కరోనా వైరస్ పట్ల ట్రంప్ నిర్లక్ష్యం చేశారన్నది యావత్ అమెరికా అంగీకరిస్తున్న విషయం. కరోనా ను లైట్ గా తీసుకోవడంతో లక్షల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ట్రంప్ మాటలను….
చైనాను బూచిగా చూపిస్తూ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ను అమెరికన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫస్ట్ అమెరికన్ నినాదం కూడా ఈసారి పెద్దగా పనిచేసేటట్లు కన్పించడం లేదు. మరోవైపు ప్రత్యర్థి పార్టీ రోజురోజుకూ పుంజుకుంటోంది. బైడెన్ సభలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటమే ఇందుకు నిదర్శనం. దీంతో ట్రంప్ ఓటమి ముందుగానే ఖరారయిపోయిందన్న కథనాలు అమెరికా మీడియాలో కన్పిస్తున్నాయి.
సర్వేలు సయితం……
దీంతో పాటు అనేక సర్వేలు కూడా ట్రంప్ నకు వ్యతిరేకంగా వస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం చూస్తే ట్రంప్ కన్నా జోబైడెన్ 51 నుంచి 43 శాతం ముందున్నట్లు తేలింది. ఎన్.బి.సి., వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి సర్వేలోనూ ట్రంప్ వెనకబడి ఉండటం విశేషం. నల్లజాతీయులు 90 శాతం మంతి ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. మహిళలు, పట్టభద్రుల్లోనూ అత్యధికంగా బైడెన్ వైపే ఉన్నారని తేలింది. రెండోసారి ట్రంప్ గెలుపు అంత ఈజీ కాదని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.