‘ముప్పు ముంగిట రెచ్చిపోతున్న పార్టీలు … ?

మానవుడు సంఘజీవి. ఇది కాదనలేని సత్యమే. అయితే కరోనా మహమ్మారి మానవ సంబంధాలను పూర్తిగా చిదిమేసింది. ఒకే ఇంట్లో ఉండే అమ్మా నాన్న, భార్య భర్త పిల్లలు [more]

Update: 2021-07-12 00:30 GMT

మానవుడు సంఘజీవి. ఇది కాదనలేని సత్యమే. అయితే కరోనా మహమ్మారి మానవ సంబంధాలను పూర్తిగా చిదిమేసింది. ఒకే ఇంట్లో ఉండే అమ్మా నాన్న, భార్య భర్త పిల్లలు సైతం బయటకు వెళ్లివస్తే వారిని అంటరానివారిగా చూసే వాతావరణం ప్రస్తుతం అంతా వెంటాడుతుంది. కరోనా తొలి వేవ్ ను చూసిన సమాజం సెకండ్ వేవ్ పొంచి ఉందిరా బాబు అన్నా కూడా పూర్తి నిర్లక్ష్యంతో చేదు ఫలితం చవి చూసింది. ఇలాంటి సమయంలో దేశంలో థర్డ్ వేవ్ తప్పదని సైతం నిపుణులు ఒక పక్క హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అవుతుందని సుప్రీం కోర్టు కి కేంద్రం హామీ ఇచ్చింది. డిసెంబర్ లోనే థర్డ్ వేవ్ అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో పదిమందికి ఆదర్శంగా నిలవాలిసిన రాజకీయ పార్టీలు పట్టు తప్పి ప్రజలకు పరోక్షంగా తప్పుడు సంకేతాలు పంపుతున్నాయి.

వేగం పెంచిన పార్టీలు …

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే అసలు కరోనా అంటే ఏమిటి అనే స్థాయిలో పార్టీల హంగామా సాగుతుంది. అధికారపార్టీ నేతలు దూకుడు గా ప్రజల్లోకి వెళుతుంటే ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చుంటాయి. అవి కూడా తమ ఉద్యమాలను, సమస్యలపై పోరాటాలను ముమ్మరం చేసేశాయి. తెలంగాణ లో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలపై అధికార టీఆరెస్, విపక్షాలు, కాంగ్రెస్ బిజెపి లు గట్టి ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో గులాబీ దళం రోడ్డెక్కింది. మేమెక్కడ తగ్గం కదా అంటూ బిజెపి దాని బాటలో సాగుతుంటే కొత్త అధ్యక్షుడు రాకతో టి పిసిసి దూకుడు పెంచేసింది.

ఏపీలోనూ అంతేగా …

ఇక ఏపీ లో ఇప్పటివరకు తన ఇంటినుంచి కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన సీఎం జగన్ జనంలోకి వెళ్ళే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేశారు. చంద్రబాబు మాత్రం ఎక్కడా తగ్గకుండా దీక్షలతో మెగా ఈవెంట్స్ మొదలు పెట్టేశారు. ఇంకోపక్క ధర్నాలు సైతం మొదలు అయిపోయాయి. ఇలా వీరంతా తమ ఉనికి కోసం రోడ్లపైకి దిగి పోవడంతో థర్డ్ వేవ్ ఆషామాషీగా ఉండబోదన్నది మాత్రం స్పష్టం అయిపోతుందంటున్నారు నిపుణులు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం రాజకీయపక్షాలు క్రియేట్ చేస్తూ ఉండటంతో రాబోయే ఆరునెలల్లో పరిస్థితి ఎలా మారుతుందన్న ఆందోళన మొదలైపోయింది.

Tags:    

Similar News