ఫైనల్ “ఫిగర్” అదేనట…!!

దేవెగౌడ పట్టుబడితే మెట్టు దిగరన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. తాను అనుకున్నది సాధించేంతవరకూ ఆయన క్షణం విశ్రమించరంటారు. ఇప్పుడు కర్ణాటకలో సీట్ల పంపకంలోనూ ఇదే జరుగుతోంది. [more]

Update: 2019-03-08 18:29 GMT

దేవెగౌడ పట్టుబడితే మెట్టు దిగరన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. తాను అనుకున్నది సాధించేంతవరకూ ఆయన క్షణం విశ్రమించరంటారు. ఇప్పుడు కర్ణాటకలో సీట్ల పంపకంలోనూ ఇదే జరుగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తన బలం, పార్టీ సత్తాను చూపాలనుకుంటున్నారు. సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉండటం, కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేస్తుండటంతో ఎక్కువ స్థానాలు దక్కించుకుని.. గెలుచుకుని కేంద్రంపై తన పట్టును మరింత బిగించి కుమారస్వామిని పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంచాలన్నది దేవెగౌడ లక్ష్యంగా కన్పిస్తుంది.

ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ…..

వచ్చే ఎన్నికల్లో వస్తున్న సర్వేలను బట్టి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఇటు బీజేపీ అయినా, అటు కాంగ్రెస్ అయినా ఇతర పార్టీల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకోసం ఎక్కువ స్థానాలున్న పార్టీకి ఢిల్లీలో గౌరవం దక్కుతుంది. పదవులు వాటంతటే అవే వస్తాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా అనుకున్నంత బాగాలేదు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత మోదీకి కొంత ఇమేజ్ పెరిగినమాట వాస్తవమేనన్నది ప్రత్యర్థులూ అంగీకరించే విషయమే.

కొంత దిగివచ్చినట్లు…..

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దేవెగౌడ పది స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంుటున్నారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలుంటే జనతాదళ్ ఎస్ తొలి నుంచి 12 సీట్లు డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ దానికి ససేమిరా అంటోంది. ఆరింటికి మించి ఇవ్వలేమని కాంగ్రెస్ నేతలు సంకేతాలు పంపారు. అయితే తన ఇద్దరు మనవళ్లు నిఖిల్, ప్రజ్వల్ లకు మాండ్య, హసన్ నియోజకవర్గాలను ప్రకటించిన దేవెగౌడ తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నదీ స్పష్టత ఇవ్వలేదు.

కుమారుడి కుర్చీ కూడా…..

బెంగళూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో పెద్దాయన ఉన్నారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలోనూ సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. అయితే దేవెగౌడ మాత్రం ఒక మెట్టు దిగి తమకు పన్నెండు కాకున్నా పది స్థానాలు మాత్రం కావాల్సిందేనని చెప్పి వచ్చేశారు. దేవెగౌడ ఫిగర్ ఫైనల్ అన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. పది స్థానాల్లో గెలిచి కేంద్రంలో రానున్న ప్రభుత్వంలో కీలకంగా మారడమే కాకుండా, కుమారస్వామి కుర్చీ కూడా కాపాడటం ఇప్పుడు ఆయన బాధ్యత. అందుకే పదికి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు జనతాదళ్ ఎస్ నేతలు. మరి రాహుల్ గాంధీ పదికి ఫైనల్ చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News