ఈ బూతులేంది బాబాయ్

ధర్మంగా ఉంటారని, మెత్తగా మెతగ్గా ఉంటారని ఆయనకు పేరు. కానీ మహాభారతంలో చెప్పినట్లుగా అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఏం జరుగుతుందో అలాగే ధర్మాన కృష్ణ దాస్ [more]

Update: 2020-10-04 08:00 GMT

ధర్మంగా ఉంటారని, మెత్తగా మెతగ్గా ఉంటారని ఆయనకు పేరు. కానీ మహాభారతంలో చెప్పినట్లుగా అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఏం జరుగుతుందో అలాగే ధర్మాన కృష్ణ దాస్ విషయంలో జరుగుతోంది. ఆయన అలిగారు. ఏకంగా చంద్రబాబు మీదనే ధర్మాగ్రహం ప్రకటించారు. బాబుని పట్టుకుని ఘాటు విమర్శలే చేశారు. ఒక దశలో ఊగిపోతూ మీడియాలో కూడా రాయలేని విధంగా బూతులే వాడారు. ఇది తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గం నరసన్నపేటలో ధర్మాన కృష్ణ దాస్ రెచ్చిపోయి మరీ బాబును చెడా మడా తిట్టేసారు. నిజంగా దాసన్నేనా ఇలా మాట్లాడింది అని మీడియా కూడా ఒకటికి పదిమార్లు చెక్ చేసుకోవాల్సింది వచ్చిందంటే దాసన్న కోపం ఎంతలా హద్దులు దాటిందో కదా.

అదీ విషయమట …

ఉత్తరాంధ్రలోని అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళం. ఇక్కడ అభివృద్ధి కోసం మంత్రిగా ధర్మాన కృష్ణ దాస్ పాటుపడుతున్నారు. రాజధాని విశాఖకు వస్తే ఎక్కువ లాభం కలిగేది కూడా సిక్కోలుకే. ఇదే విషయాన్ని గతంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా అంటూ ఉండేవారు. మా పొట్ట కొట్టకు బాబూ, ఉత్తరాంధ్రా మీద ద్వేషం వద్దు. రాజధాని వస్తే అందరికీ మంచిదేనని తమ్మినేని కూడా బాబును వేడుకున్నారు. అడ్డుకుంటున్నందుకు మండిపడ్డారు. ఇపుడు ధర్మాన కృష్ణ దాస్ అయితే మరి నాలుగాకులు ఎక్కువ చదివారు. బాబు అమరావతిలో రైతుల పేరిట చేయిస్తున్నది పెయిడ్ ఉద్యమ‌మని ఏకి పారేశారు. టీ షర్టులు వేసుకుని ఉద్యమాలు చేసేవారు రైతులా బాబూ అంటూ నిలదీశారు.

పోటీ చేసి గెలవాలి….

ఇదే సమయంలో విశాఖ నుంచి చంద్రబాబు పోటీ చేసి గెలవాలని కూడా ధర్మాన కృష్ణ దాస్ సవాల్ చేశారు. బాబు ఎక్కడ నిలబడితే తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని కూదాధర్మాన కృష్ణ దాస్ చాలెంజి చేశారు. బాబుని తాను ఓడించి తీరుతానని, ఒకవేళ అలా జరగకపోతే రాజకీయ సన్యాసమేనని కూడా ఆయన స్పష్టం చేశారు. బాబు ఓడితే అమరావతి అన్న మాట మానుకోవాలని కూడా సూచించారు. నిజానికి విశాఖలో టీడీపీ ఇపుడు బక్కచిక్కంది. బాబు ఇక్కడకు వచ్చి ఎందుకు పోటీ చేస్తారూ. ఆ సంగతి తెలిసే బాబును ఉప ముఖ్యమంత్రి రెచ్చగొట్టారన్న మాట.

దూకుడేనా…..

ఇవన్నీ ఇలా ఉంటే సిక్కోలు నుంచే ఏపీ కొత్త ప్రెసిడెంట్ టీడీపీకి వస్తాడని అంటున్నారు. దాంతో అచ్చెన్నాయుడు మీద దూకుడు రాజకీయం చేయడానికి ధర్మాన కృష్ణ దాస్ తన టోన్, సౌండ్ రెండూ మార్చేసారని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ బూతులు మాట్లాడం మంచిది కాదని సొంత పార్టీలో నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి బూతు పురాణంతో వైసీపీ ఇమేజ్ కి బాగా డ్యామేజ్ తెచ్చారు. ఇపుడుధర్మాన కృష్ణ దాస్ ఆయన పక్కన చేరితే పోయేది సర్కార్ పరువేనని అంటున్నారు. పైగా అసలు విషయం జనాలకు చేరకపోగా బాబు లాంటి వారికి సానుభూతి కూడా వస్తుందని అంటున్నారు. కాగా దీని మీద మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప మాట్లాడుతూ బూతుల మంత్రులను జనం సహించరని అంటున్నారు. వైసీపీకి ఇదే చివరి ఛాన్స్ అని, జనాలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని రానివ్వరని కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికి దాసన్న కొంచెం ఓవర్ చేశారా అన్నదే పార్టీలో చర్చగా ఉందిట

Tags:    

Similar News