అధర్మాన్ని అంగీకరించిన ధర్మసేన

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంటుంది ? అలాగే వుంది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ముగిసిన పోటీ పై సమీక్ష. ఐదు పరుగులు [more]

Update: 2019-07-23 02:00 GMT

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంటుంది ? అలాగే వుంది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ముగిసిన పోటీ పై సమీక్ష. ఐదు పరుగులు ఇవ్వలిసిన చోట ఆరుపరుగులు ఇచ్చిన శ్రీలంక అంపైర్ ధర్మసేన తప్పు జరిగిందని పెద్ద మనసుతో ఒప్పేసుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చకు దారితీసింది. ఇక సామాజిక మాధ్యమాల నిండా ఈ గోలే. న్యూజిలాండ్ కొంప ముంచిన అంపైర్ తప్పుడు నిర్ణయంపై అంతా ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నా కప్ మాత్రం ఇంగ్లాండ్ వెనక్కి అయితే ఇచ్చే పరిస్థితి లేదు కదా. అయినా రచ్చ రంబోలా అయిపొయింది ఈ ఎపిసోడ్.

ఐదుకి ఆరు ఎలా అంటే ? ….

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్ కొట్టిన బాల్ కి ఒక్క పరుగు వచ్చే చోట రెండు కోసం ప్రయత్నం చేశాడు. మ్యాచ్ హోరా హోరీగా సాగుతున్న ఆ తరుణంలో రిస్క్ చేయక తప్పని పరిస్థితి ఇంగ్లాండ్ ది. దాంతో రెండు పరుగులు కోసం చేసిన ప్రయత్నంలో స్టోక్ విజయవంతం అయ్యాడు. అయితే ఫీల్డర్ విసిరిన బంతి క్రీజ్ లోకి దూసుకొస్తున్న బ్యాట్స్ మెన్ బ్యాట్ కి తగిలి బౌండరీకి పోయింది.బాల్ స్టోక్ బ్యాట్ కి తగిలే సమయానికి బౌలర్ ఎండ్ వైపు బ్యాట్స్ మెన్ ఇంకా క్రీజ్ చేరలేదు. అప్పుడు బైస్ తో కలిపి ఐదు పరుగులు మాత్రమే అంపైర్ ప్రకటించాలి. కానీ ఫీల్డ్ అంపైర్ ధర్మసేన ఆరు రన్స్ ఇచ్చేశారు. మ్యాచ్ టై కావడం తరువాత సూపర్ ఓవర్ లో టై అయినా బౌండరీ కౌంట్ తో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. మ్యాచ్ జరుగుతుండగానే ఈ సంఘటనపై చర్చ జరిగినా అంపైర్ నిర్ణయం ఫైనల్ కావడంతో ఎవరు చేసింది ఏమి లేకపోయింది.

ఏటిసేత్తాం … తప్పయిపోయినాదే ….

దీనిపై ఐసిసి సైతం తమ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదంటూ తప్పించేసుకుంది. ఇక అంతా చల్లబడింది వాతావరణం అన్నాకా ధర్మసేన తాను పొరపాటు చేశానని ఒప్పేసుకుని చేసిన సంచలన వ్యాఖ్య వైరల్ గా మారింది. తన ముందు భారీ టీవీ ఏదీ లేదని రీప్లే చూసే ఛాన్స్ లేనందున తప్పు జరిగిందని చూశాకా న్యూజిలాండ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాము చూసింది ప్రపంచ కప్ మ్యాచ్ నా గల్లీ మ్యాచా అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్ భయంకరంగా నడుస్తున్నాయి. ఐసిసి పై ఒంటికాలిపై లేస్తూనే అంపైర్ ధర్మసేన తప్పుడు పనిపై విరుచుకుపడిపోతున్నారు. ఇప్పటికే బౌండరీ కౌంట్ తో ఇంగ్లాండ్ ను విజేత చేయడం తోనే రగిలి పోతున్న క్రికెట్ అభిమానుల అగ్నికి తాజాగా ధర్మసేన ప్రశాంత స్టేట్ మెంట్ ఆజ్యం పోసేసింది. ఇది ఎంత కాలం రాగులుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News