డొక్కా చూపు.. ఎమ్మెల్యే వైపు.. వ‌ర్కవుట్ అయ్యేనా ?

ఎప్పుడు కుదిరితే అప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయాల‌ని భావిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు ఆశ‌లు ఫ‌లించేనా ? ఆయ‌న‌కు [more]

Update: 2021-05-07 11:00 GMT

ఎప్పుడు కుదిరితే అప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయాల‌ని భావిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మె ల్సీ డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు ఆశ‌లు ఫ‌లించేనా ? ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కేనా? ఇదీ ఇప్పుడు గుంటూరు జిల్లా తాడికొండ నియ‌జ‌క‌వ‌ర్గం రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య సాగుతున్న కీల‌క చ‌ర్చ. డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు కు తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం అంటే మ‌హాప్రీతి. ఆయ‌న ఇక్కడ నుంచి గ‌తంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు… కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చి ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు గ‌త ఎన్నిక‌ల్లో తిరిగి తాడికొండ నుంచి పోటీ చేసేందుకు స‌ర్వశ‌క్తులా ప్రయ‌త్నాలు చేశారు. స్థానిక టీడీపీ నేత‌ల్లో కొంద‌రు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆయ‌న అయిష్టంగానే ప‌క్కనే ఉన్న ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోవాల్సి వ‌చ్చింది.

తాడికొండపై ప్రేమతో…..

గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా… ఆయ‌న‌కు అంత‌కు ముందే చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చినా.. పార్టీలో ఉండ‌కుండా.. కేవ‌లం తాడికొండ‌పై ప్రేమ‌తో వైసీపీలో చేరార‌న్న ప్రచారం ఉంది. ఎలాగైనా వ‌చ్చే ఎన్నికల నాటికి తాడికొండ టికెట్ ద‌క్కించుకుని మ‌ళ్లీ త‌న కంచుకోట తాడికొండ‌లో పాగా వేయాల‌న్నదే డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు ప్లాన్‌. ఇందుకోసం ఆయ‌న ఇప్పటి నుంచే బాగా గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వైసీపీ నాయ‌కురాలు డాక్టర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ శ్రీదేవిపై స్థానికంగా కొంత వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఆమె దూకుడుతో సొంత పార్టీ నేత‌లే.. ఆమెను ప‌క్కన పెట్టాల‌నే డిమాండ్ చేస్తున్నారు.

శ్రీదేవిపై వ్యతిరేకతతో…..

ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా జిల్లా స్థాయిలో అనేక మంది నేత‌లు ఆమెకు యాంటీ అయిపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీ శ్రీదేవి అనుకూల వ‌ర్గం.. శ్రీదేవి వ్యతిరేక వ‌ర్గంగా రెండుగా చీలిపోయింది. ప్రస్తుతం లోపాయికారీగా.. ఆమెపై వ్యతిరేక‌త సాగుతున్నా.. పైకి మాత్రం అంతా బాగున్నట్టుగానే శ్రీదేవి వ‌ర్గం ప్రచారం చేసుకుంటోంది. తాడికొండ‌లో ప్రస్తుతం ఉన్న పొలిటిక‌ల్ సినారియో చూస్తే ఎమ్మెల్యే శ్రీదేవి వ‌ల్ల ఇక్కడ త‌మ‌కు జ‌రిగిన అభివృద్ధి అంటూ ఏమీలేద‌నే వాద‌నతో పాటు.. రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆమె చేసిన కామెంట్లు .. వంటివి ఆమె ప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

వారిద్దరినీ తట్టుకుని….

దీంతో ఆమెను మార్చడం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీలోని కొంద‌రు నాయ‌కులు. ఇప్పుడు ఈ విష‌యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు స్థానిక నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటూ.. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్యక్రమాల‌పై దృష్టి పెడుతున్నార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే శ్రీదేవికి బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ( సురేష్‌ది కూడా తాడికొండే) మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. సురేష్ కూడా ఇక్కడ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటూ శ్రీదేవికి త‌ల‌పోటుగా మారారు. ఆయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని త‌న వ‌ర్గాన్ని పెంచుకుంటున్నారు. మ‌రి శ్రీదేవి, సురేష్‌ను త‌ట్టుకుని డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద‌రావు వేసే వ్యూహాలు ఎన్నిక‌ల నాటికి వ‌ర్కవుట్ అవుతాయా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News