అంత అసహనం ఎందుకు రాజా?

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అన్ని సర్వేలూ [more]

Update: 2020-10-25 16:30 GMT

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అన్ని సర్వేలూ జో బైడెన్ కు అనుకూలంగానే వస్తున్నాయి. ట్రంప్ కు కూడా ఓటమి భయం పట్టుకుంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ట్రంప్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు.

గెలుపోటములు సహజం…..

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎవరైనా గెలవొచ్చు. ప్రజామద్దతు ఎవరికి ఉంటే వారిదే గెలుపు. కానీ ట్రంప్ మాత్రం తాను ఓడినా అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు అంగీకరించనని ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైతే చైనా మరింత రెచ్చిపోతుందని కూడా అన్నారు. ఓకే ఇంతవరకూ రాజకీయ పరమైన ఆరోపణలే కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

బెదిరింపులేనా?

కానీ తాజాగా ట్రంప్ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. తాను ఓటమి పాలయితే అమెరికా వదలి వెళ్లాల్సి వస్తుందేమోనని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది లక్షల సంఖ్యలో మరణించడానికి ట్రంప్ నిర్లక్ష్యమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే కరోనా వ్యాక్సిన్ వస్తుందని చెబుతూ కొంత మద్దతును కూడ గట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యాఖ్యలు ఇబ్బందేనా?

తాను ఓటమి పాలయితే అమెరికా విడిచి వెళతామోనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బెదిరింపులేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ కామెంట్స్ ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చి పెట్టాయంటు న్నారు. స్వయంగా తన పరిస్థితి బాగా లేదని పదే పదే చెప్పడం కూడా ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. మరి ట్రంప్ ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? అసహనంతోనా? ఓటమి భయంతోనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ ఏ పార్టీ అభ్యర్థి చేయని కామెంట్స్ ఇప్పుడు ట్రంప్ చేస్తుండటం విశేషం.

Tags:    

Similar News