ట్రంప్ కు ఇలా కావాల్సిందేనా?

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన ట్రంప్ ఓటమి పాలయ్యారు. సహజంగా అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి కూడా గెలుస్తుంటారు. కానీ ట్రంప్ విషయంలో ఇది జరగలేదు. [more]

Update: 2020-11-08 03:30 GMT

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన ట్రంప్ ఓటమి పాలయ్యారు. సహజంగా అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి కూడా గెలుస్తుంటారు. కానీ ట్రంప్ విషయంలో ఇది జరగలేదు. దీనికి కారణం ట్రంప్ స్వయంకృతాపరాధమే కారణమని చెప్పకతప్పదు. పిచ్చి నిర్ణయాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనను ప్రజల్లో పలుచన చేశాయని చెప్పక తప్పదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదంటారు.

ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు…..

నాలుగేళ్లలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ట్రంప్ కు ప్రతికూలంగా మారాయి. నిజానికి ట్రంప్ తో పోల్చుకుంటే డెమొక్రాట్ల అభ్యర్థి జోబైడెన్ బలహీన అభ్యర్థి. డెమొక్రాట్లు అభ్యర్థి ఎంపికను ఆలస్యం చేయడానికి కూడా కారణమిదే. అలాంటి బలహీన అభ్యర్థిపైనే ట్రంప్ ఓటమి పాలయ్యారంటే ట్రంప్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ పాలన పోవాలని అమెరికాలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం కూడా పెరగడం విశేషం. వీసా నిబంధనలను కఠిన తరం చేయడం కూడా ఆయనకు వ్యతిరేకత తెచ్చి పెట్టింది.

అంతటా వ్యతిరేకత….

గత ఎన్నికలలో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. వలస విధానాలు, హెల్త్ పాలసీ లు వంటివి ఆయనపై అమెరికన్లలో వ్యతిరేకతను పెంచాయి. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య కూడా ట్రంప్ ఓటమికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అమెరికా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ట్రంప్ ప్రజల్లో మరింత పలచనగా మారిపోయారు.

కరోనా కూడా ……

ఇక కరోనా వైరస్ విషయంలో ట్రంప్ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది. రాష్ట్రాల గవర్నర్ల నివేదికలను కడా ఆయన పట్టించుకోలేదు. దీంతో కరోనా వైరస్ అమెరికాలో విజృంభించింది. లక్షల సంఖ్యలో కరోనాకు బలయ్యారు. కరోనాను లైట్ తీసుకోవడం వల్లనే వ్యాధి విజృంభించిందని ప్రజలు బలంగా అభిప్రాయపడ్డారు. దీనిని కప్పి పుచ్చుకునేందుకు ట్రంప్ చైనాపై ఎంత దూకుడు ప్రదర్శించనిప్పటికీ ఫలితం కన్పించలేదు. చివరకు వైట్ హౌస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ట్రంప్ నిష్క్రమణ అలా జరిగిపోయింది.

Tags:    

Similar News