టీడీపీ మేధావి వర్గం తిని కూర్చుందా ?
అవును! టీడీపీ మేధావి వర్గం ఏం చేసింది? టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబ రావు సహా.. అనేక మంది మేధావులు సలహాదారులుగా.. ఇతర పదవుల్లోను ఉన్నారు. [more]
అవును! టీడీపీ మేధావి వర్గం ఏం చేసింది? టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబ రావు సహా.. అనేక మంది మేధావులు సలహాదారులుగా.. ఇతర పదవుల్లోను ఉన్నారు. [more]
అవును! టీడీపీ మేధావి వర్గం ఏం చేసింది? టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబ రావు సహా.. అనేక మంది మేధావులు సలహాదారులుగా.. ఇతర పదవుల్లోను ఉన్నారు. అదేసమయంలో టీడీపీకి చెందిన సీనియర్లు కూడా సలహాలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్కరూ సరైన మార్గంలో పార్టీని నడిపించలేక పోయారా? పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా.. పదికాలాల పాటు పనిచేసేలా .. ఎవరూ చర్యలు తీసుకోలేక పోయారా ? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీలో చర్చకు దారితీస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. వైసీపీ ప్రభుత్వం జోరుగా ఆలోచనలు చేస్తుండడంతోపాటు.. అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.
సంక్షేమ పథకాలతో….?
అనేక పథకాలు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోను చూసిన టీడీపీ నేతలు.. పెదవి విరిచారు. అమ్మ ఒడికి ఏడాదికి 15 వేలు ఇవ్వడం సాధ్యం కాదని.. ప్రచారం చేశారు. కానీ, రెండేళ్లలో సంపూర్ణంగా అమలు చేసిన జగన్.. దీనిని సాధ్యం చేసి చూపించారు. ఇక, పేదలకు ఇళ్లు.. అనేది కాన్సెప్ట్ మాత్రమేనని, రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున స్థలాలు ఎక్కడ ఉన్నాయని.. టీడీపీ నేతలు విమర్శించారు. ఇప్పటికీ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా వాహనమిత్ర, 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు.
వరస కార్యక్రమాలతో….
అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ వ్యవస్థ.. అనేకం అమలు అవుతున్నాయి. ఇంకా.. సరికొత్త పథకా లకు రూపకల్పన చేయాలని సీఎం జగన్ సంబంధిత సలహాదారులపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న పథకాలకు మించిన పథకాలు తీసుకువచ్చేందుకు వైసీపీలో పక్కా ప్లాన్ ప్రకారంముందుకు సాగుతున్నారు.
ఆ ఐదేళ్లు ఏం చేశారు?
ఈ క్రమంలో ఆయా పరిణామాలను అంచనా వేస్తున్న టీడీపీ నేతలు.. మన సలహాదారులు ఏం చేశారు.. ఐదేళ్లు తినిపడుకున్నారా ? ఒక్కటంటే.. ఒక్క ఆలోచన కూడా చేయలేక పోయారు.. ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేక పోయారు. ఎన్నికల సమయంలో పసుపు-కుంకుమ తప్ప.. చేసింంది ఏమీలేదు.. అని తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.