వింత జంతువా … మరేదేనైనా ….?
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో ఇప్పుడు కరోనా కాదు భయపెడుతుంది. రాత్రి వేళల్లో పంటపొలాల్లో చనిపోతున్న తమ పశువులు ను హరిస్తున్నది ఎవరు అనేదే. గత [more]
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో ఇప్పుడు కరోనా కాదు భయపెడుతుంది. రాత్రి వేళల్లో పంటపొలాల్లో చనిపోతున్న తమ పశువులు ను హరిస్తున్నది ఎవరు అనేదే. గత [more]
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో ఇప్పుడు కరోనా కాదు భయపెడుతుంది. రాత్రి వేళల్లో పంటపొలాల్లో చనిపోతున్న తమ పశువులు ను హరిస్తున్నది ఎవరు అనేదే. గత కొద్ది రోజులుగా ఆలమూరు మండల పరిధిలోని పశువులు పై రాత్రి సమయంలో మృతి చెందుతున్నాయి. ఈ పశువులపై ఏదో జంతువు దాడి చేస్తుంది. అది ఏమిటి అనేది మిస్టరీగా మారింది. దాంతో మండలంలో రైతాంగం హడలి పోతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతూ రైతులు పంటపొలాలపై గస్తీ కాస్తూ పశువుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా పశు మృత్యు ఘోష ఆగడం లేదు.
రంగంలోకి అటవీశాఖ …
ఇప్పటివరకు దాదాపు 20 పశువులు, జంతువులు ఈ కనిపించని జంతువు కి ఆహారంగా మారిపోయాయి. దాంతో సమాచారం అందుకున్న అటవీశాఖ రంగంలోకి దిగి వేట మొదలు పెట్టింది. అడవి నుంచి చిరుతలు, పెద్ద పులులు మరేదైనా జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నా అలాంటి ఆనవాళ్లు దొరకలేదు . దాంతో రాత్రివేళ వస్తున్న ఆ జంతువు అడుగుజాడలు ముందుగా కనిపెట్టే పనిలో పడింది. ఈ అన్వేషణ మొదలైన రైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే అటవీశాఖ రంగంలోకి దిగినా ఈ పశువులు, జంతువుల హత్యలు ఆగడం లేదు. ఇప్పుడు ఆలమూరు మండలం లోని రైతులు యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రివేళల్లో అపరిచిత జంతువు కోసం గాలింపు ముమ్మరం చేశారు.