విడిపోయారు సరే… అలాగే ఉండగలరా?
రక్తసంబంధాలకు, రాజకీయాలకు సంబంధం లేదు. అధికారం కోసం రక్త సంబంధాలను సయితం పక్కన పెట్టే రోజులివి. కొత్త తరహా రాజకీయాలేవీ కాకపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే [more]
రక్తసంబంధాలకు, రాజకీయాలకు సంబంధం లేదు. అధికారం కోసం రక్త సంబంధాలను సయితం పక్కన పెట్టే రోజులివి. కొత్త తరహా రాజకీయాలేవీ కాకపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే [more]
రక్తసంబంధాలకు, రాజకీయాలకు సంబంధం లేదు. అధికారం కోసం రక్త సంబంధాలను సయితం పక్కన పెట్టే రోజులివి. కొత్త తరహా రాజకీయాలేవీ కాకపోయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే రాజకీయం చోటు చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా నమ్మకంగా ఉన్న నేతల కుటుంబాలే వేరు కుంపటి పెట్టుకుంటున్నాయి. అయితే ఎన్నికల నాటికి వీరు విడిగా ఉంటారా? కలసిపోతారా? అన్నది ప్రశ్నార్ధకమే.
పట్టున్న కుటుంబాలే అయినా….
ఒక నియోజకవర్గంలో, ప్రాంతంలో కుటుంబం పట్టు ఉంటుంది. ఆ కుటుంబమే రాజకీయంగా ఎదుగుతుంది. కుటుంబంలోని సభ్యులు విడిపోయినంత మాత్రాన ఓట్లు చీలిపోతాయనుకోవడం భ్రమే. కేఈ కుటుంబాన్ని తీసుకుంటే వారికి పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో పట్టు ఉంది. ఇక్కడ కేఈ కుటుంబమే కొన్ని దఫాలుగా పోటీ చేస్తూ వస్తుంది. కర్నూలు నగరంలో సయితం కేఈ కుటుంబం ఎంతో కొంత ప్రభావం చూపనుంది.
కేఈ కుటుంబం…..
అయితే ఇప్పడు కేఈ కుటుంబంలో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన విడిపోయినంత మాత్రాన క్యాడర్ ప్రభాకర్ వెంట పరుగులు తీస్తుందని చెప్పలేం. ఎందుకంటే కేఈ ప్రభాకర్ పార్టీ నుంచి వెళ్లిపోయినా ఆయన సోదరులు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్ లు ఇంకా టీడీపీలోనే ఉన్నారు. కేఈ ప్రభాకర్ పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేదీ లేదని టీడీపీ చెబుతోంది. అధికారం కోసమే ప్రభాకర్ వెళ్లాడంటోంది టీడీపీ.
బీద సోదరులు కూడా…..
ఇక నెల్లూరు జిల్లాలో బీద సోదరులు దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. వీరికి కావలి నియోజకవర్గంలో బలం ఉంది. అన్నదమ్ములైన బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రలు కలసి కట్టుగా వ్యాపారాలు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి విడిపోయారు. బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. ఆయన రాజ్యసభ పదవి వస్తుందని ఆశించారు. కానీ అది రాలేదు. కండువా కప్పుకున్న మస్తాన్ రావు పార్టీ అభివృద్ధికి ఏ మేరకు కృషి చేస్తారన్నది సందేహమే. ఇలా కుటుంబాలు రాజకీయంగా విడిపోతుండటం కొత్తేమీ కాకపోయినా వీరి వల్ల పార్టీకి కొత్తగా ఒరిగేమీ లేదన్నది వాస్తవం.