అదే జరిగితే నష్టమేగా మరి

సాఫీగా సాగిపోతున్న మోదీ పాలనకు రైతులే బ్రేకులు వేసేటట్లు కన్పిస్తున్నారు. ఇప్పటికే రైతు చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతాంగం నిరసనలను వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఉత్తర [more]

Update: 2020-12-07 18:29 GMT

సాఫీగా సాగిపోతున్న మోదీ పాలనకు రైతులే బ్రేకులు వేసేటట్లు కన్పిస్తున్నారు. ఇప్పటికే రైతు చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతాంగం నిరసనలను వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఉత్తర భారతంలో రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులు ఇప్పటికే ఉద్యమిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా రైతు ఉద్యమం రాజుకుంటోంది. కార్పొరేట్ వర్గాలకు మద్దతుగా ఈ కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలపై…..

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నట్లే కన్పిస్తుంది. రైతులు ఆందోళన తీవ్రమవుతున్నా ఆయన రైతులకు ఎటువంటి నష్టం కలిగించవని చెబుతున్నారు. ఇంకా ప్రయోజనమేనని నిత్యం వివరిస్తున్నారు. దీంతో నరేంద్ర మోదీ కొత్త వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం వెనక్కు తగ్గరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రైతులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రైతులకు అండగా రాజకీయ పార్టీలు కూడా నిలుస్తుండటంతో ఉద్యమం మరింత పెరుగుతోంది.

అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు….

ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏలోని మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పంజాబ్ కుచెందిన ఈ ప్రాంతీయ పార్టీ అక్కడ రైతు ఉద్యమం తీవ్రంగా ఉండటంతో ఎన్డీఏ నుంచి తప్పుకుని రైతులకు అండగా నిలుస్తోంది. పంజాబ్ లో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో రైతుల పోరాటానికి అన్ని సంఘాలు, పార్టీల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.

మిత్రపక్షాలు సయితం…..

తాజాగా ఎన్డీఏ నుంచి మరో మిత్రపక్షం తప్పుకుంది. రాజస్థాన్ కు చెందిన లోక్ తాంత్రిక్ పార్టీ రైతులకు మద్దతుగా నిలిచింది. రాజస్థాన్ లో బలమైన సామాజికవర్గం మద్దతు ఉన్న ఈ పార్టీ తప్పుకుంటామని హెచ్చరించడంతో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ పార్టీకి దాదాపు ఇరవై పార్లమెంటు స్థానాల్లో ప్రభావం చేసే శక్తి ఉంది. రాజస్థాన్ లో కూడా రైతు ఉద్యమం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం నూతన చట్టాలపై వెనక్కు తగ్గకుంటే తీవ్ర నష్టం తప్పదంటున్నారు. మరి మోదీ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News