వరద నెత్తిపై పాలు పోసిందా..?

నదీ పరివాహాక చట్టానికి తూట్లు పొడిచిన పాపానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కృష్ణమ్మ ఉధృతికి నిండా మునిగేలా వుంది. చంద్రబాబు సైతం వరదబాధితుడిగా మారేలా కృష్ణమ్మ [more]

Update: 2019-08-14 08:00 GMT

నదీ పరివాహాక చట్టానికి తూట్లు పొడిచిన పాపానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కృష్ణమ్మ ఉధృతికి నిండా మునిగేలా వుంది. చంద్రబాబు సైతం వరదబాధితుడిగా మారేలా కృష్ణమ్మ పోటెత్తింది. కృష్ణా కరకట్టపై లింగమనేని ఎస్టేట్ నిబంధనలకు విరుద్ధంగా అతిధి గృహం నిర్మించారు. ఏపీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఈ ప్రాంతాన్ని తన నివాసంగా అద్దెకు తీసుకోవడం గతంలోనే వివాదాస్పదం అయ్యింది. ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రే కరకట్ట పై నివాసం ఉండటంతో కృష్ణా నదిపై ఆక్రమణదారులు విజృంభించారు.

అడుగడుగునా ఆక్రమణలు ….

అమరావతి రాజధానిగా ప్రకటించాక అడుగు నేలకూడా లక్షల్లో పలికింది. ఫలితంగా రియల్ మాఫియా చెట్టు లేదు పుట్టా లేదు, పట్టా లేదు అడుగడుగునా ఆక్రమణలకు దిగింది. ఏ భూమి కనిపించకపోతే నదీ పరివాహక ప్రాంతాన్ని దిగమింగేసారు. వీరికి నాటి ప్రభుత్వంలోని అధికారులు నేతలు అండగా నిలిచారు. కళ్ళముందే అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాధులే లేకుండా పోయారు. ఈ క్రమంలోనే అసైన్డ్ భూములు కు సైతం రెక్కలు వచ్చేశాయి. ఇలా ఒకటేమిటి అమరావతి చుట్టూ ముఖ్యంగా నదీతీర ప్రాంతం కబ్జాకు గురైంది. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం గమనార్హం.

వరదకు ఛాన్స్ లేదనుకుంటే ….

కృష్ణానదికి వరదలు వచ్చినా కర్ణాటక దాటి, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మీదుగా అమరావతి వరకు వచ్చే అవకాశం లేదనుకున్నారు కరకట్ట కబ్జాదారులు. గత పదేళ్లకాలంలో ఎన్నడూ అలా బెజవాడ వరకు వరద పోటెత్తిన సందర్భంలేదు. ఎగువ ప్రాంతాల్లో ఆరు జలాశయాలు నిండి కిందకు నీరు రావడం అయ్యే పనే కాదని భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రికార్డ్ స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, పూర్తిగా నిండి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల కూడా పూర్తి స్థాయి నీటిమట్టాలు తో కళకళ లాడుతున్నాయి. దాంతో ప్రకాశం బ్యారేజ్ వైపు పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ. అదే ఇప్పుడు నదీపరివాహక ప్రాంతాన్ని అమరావతి లో కబ్జా చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. చంద్రబాబు నివాసానికి చేరుకుంది.

రాజకీయం చేసిన టిడిపి …

అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నివాసం ఉంటూ ప్రజలకు ఏమి సందేశం ఇస్తారంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ టిడిపి అధినేతపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళడానికి దగ్గరలో వున్న ప్రజావేదికను సైతం కూల్చి పరోక్ష హెచ్చరికలను జగన్ పంపినా ఆ అంశాన్ని రాజకీయంగానే మల్చుకుని ఎదురుదాడికి దిగారు విపక్ష నేత చంద్రబాబు. తనను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సానుభూతి రాజకీయానికి తెరలేపారు చంద్రబాబు. రాష్ట్రంలో 70 వేలమంది కరకట్టలు ఆక్రమించుకుని ఉన్నారని వారందరిని ఖాళీ చేయించి తమ వద్దకు రావాలంటూ టిడిపి వితండవాదాన్ని తెరపైకి తెచ్చింది.

ముందే చెప్పినా వింటే గా ….

ఈ వివాదాం ఇలా ఉండగానే ఇప్పుడు ఎవ్వరు ఊహించని స్థాయిలో వరద వచ్చి పడింది. చంద్రబాబు పై క్షక్ష సాధింపు ధోరణి అన్న ప్రచారానికి డిఫెన్స్ లో పడిన వైసిపికి తాజా వరద నెత్తిపై పాలు పోసింది. చంద్రబాబు కొంప నీట మునిగితే మరింత రచ్చ చేసి ఆయన్ను ఇల్లు ఖాళీ చేయించేందుకు ఇదే ఛాన్స్ అని భావిస్తుంది అధికారపార్టీ. మేము ముందే చెప్పామని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వినలేదంటూ మొదలు పెట్టేసింది. దీనికి తోడు చంద్రబాబు కొద్దిరోజులు హైదరాబాద్ లో విశ్రాంతి కోసం వెళ్ళడంతో ఖాళీ చేయించే పని మరింత సులువు అవుతుందని వైసిపి వర్గాల్లో ప్రచారం నడుస్తుండటంతో మరోసారి లింగమనేని అక్రమ కట్టడం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కానుంది. అందరిలాగే చంద్రబాబు నివాసం వరద ముంపు లో పడటంతో ఇప్పుడు టిడిపి ఎలాంటి అడుగు దీనిపై వేస్తుందో చూడాలి.

Tags:    

Similar News