వైసీపీ టిక్కెట్ కోసం నాలుగు స్తంభాలాట‌..!

విశాఖ జిల్లాలో ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పాడేరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ టికెట్ ద‌క్కించుకునేందుకు న‌లుగురు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటున్నారు. టికెట్ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే స‌హ‌జంగానే [more]

Update: 2019-02-06 01:30 GMT

విశాఖ జిల్లాలో ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పాడేరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ టికెట్ ద‌క్కించుకునేందుకు న‌లుగురు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటున్నారు. టికెట్ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే స‌హ‌జంగానే గ్రూప్ రాజ‌కీయాల‌కు తెర‌లేసింది. ఇది ఆ పార్టీ నాయ‌క‌త్వానికి ఇబ్బందిక‌రంగా మారింది. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొర‌వ‌డ‌టంతో పార్టీ ఎక్క‌డ దెబ్బ‌తింటుదోన‌ని అధిష్ఠానంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక పార్టీ నుంచి టికెట్ రేసులో ముఖ్యంగా ముగ్గురు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్‌ సమన్వయకర్త గొడ్డేటి మాధవి గ‌ట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

న‌లుగురి మ‌ధ్య పోటీ…

వచ్చే ఎన్నికల్లో పాడేరు టిక్కెట్‌ తనదేనని సమన్వయకర్త విశ్వేశ్వరరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం హామీ ఇచ్చిన దాఖ‌లాలు లేవని తెలుస్తోంది. ఇక మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవితో పాటు పాడేరు వైసీపీ టిక్కెట్‌ రేసులో మరికొన్ని కొత్త ముఖాలుగా జీవం స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ కె.కృష్ణారావు, కేజీహెచ్‌ డాక్టర్‌ ఎ.రామకృష్ణనాయుడు, మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు కుమార్తె డాక్టర్‌ వెంకటలక్ష్మి కూడా టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వాస్త‌వానికి పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి ఏడాది క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి వైసీపీలో చేరడంతో ఆమెను సమన్వయకర్తగా అధిష్ఠానం నియమించింది. కానీ పార్టీలోని కొంత‌మంది నాయ‌కులు ఆమెకు స‌హ‌య నిరాక‌ర‌ణ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇందులో పలువురు మండలస్థాయి నేత‌లు కూడా ఉన్నారు.

గెలుస్తామ‌నే న‌మ్మ‌కం ఉండ‌టంతో…

దీంతో అధిష్ఠానం ఊహించిన స్థాయిలో ఆమెను క్యాడ‌ర్‌ను ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఆరు నెలల్లోనే భాగ్యలక్ష్మిని తొలగించింది. తిరిగి పాడేరు సమన్వయకర్గగా నాయ్యవాది అయిన మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కూడా మండలాల్లో పర్యటిస్తూ, వచ్చే ఎన్నికల్లో పాడేరు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఆమెను అరకులోయ పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది. కానీ మాధవి పాడేరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమ‌వుతూ తెర‌వెనుక టికెట్ కోసం స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. పాడేరులో వైసీపీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉండ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆ పార్టీ గెలుస్తుంద‌న్న ధీమాతో ఉన్న వైసీపీ నాయ‌కులు, ఆ పార్టీ టిక్కెట్ ఆశిస్తోన్న ఆశావాహుల మ‌ధ్య గ‌ట్టి పోటీ త‌ప్ప‌డం లేదు.

 

Tags:    

Similar News