టీడీపీ ఎమ్మెల్యే ఒంట‌రిపోరు.. చివ‌ర‌కు మిగేలేది ?

మంది త‌క్కువ ఉన్నప్పుడు ప్రత్యర్థుల‌పై పోరాటం చేయాలంటే.. క‌ష్టమే. పోనీ.. ఉన్నవాళ్లయినా.. చేదోడు వాదోడుగా నిలుస్తారా ? అని ఎదురు చూస్తున్నా.. ఏ ఒక్కరూ ముందుకు రాని.. [more]

Update: 2021-05-20 05:00 GMT

మంది త‌క్కువ ఉన్నప్పుడు ప్రత్యర్థుల‌పై పోరాటం చేయాలంటే.. క‌ష్టమే. పోనీ.. ఉన్నవాళ్లయినా.. చేదోడు వాదోడుగా నిలుస్తారా ? అని ఎదురు చూస్తున్నా.. ఏ ఒక్కరూ ముందుకు రాని.. అంత‌కుమించి క‌లిసి రాని ప‌రిస్థితి ఏర్పడింది. అదే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి. ఇక్కడ నుంచి జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్న కూల్ లీడ‌ర్‌.. గ‌ద్దె రామ్మోహ‌న్ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌గా మారింది. ఆయ‌నకు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేదు. ఎవ‌రూ ఆయ‌న‌తో క‌లుపుగోలుగా ఉండ‌డం లేదు. పోనీ.. ఏదో ఒక‌టి జ‌రుగుతోందిలే.. ఎన్నిక‌ల దాకా వెయిట్ చేద్దాం.. అనుకుంటే.. వైసీపీ నేత‌ల దూకుడు మామూలుగా లేదు.

నాని పట్టించుకోక పోవడంతో…?

దీంతో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ ఖాతాలోనే ఉంటుందా ? ఉండ‌దా ? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. విజ‌య‌వాడ ఎంపీగా టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని విజ‌యం సాధించారు. దీంతో త‌మ‌కు పెద్ద ఆద‌రువు ఉంటుంద‌ని.. ప్రభుత్వం నుంచి నిధులు వ‌చ్చినా రాక‌పోయినా.. ఎంపీలాడ్స్ నుంచి అయినా.. కొంత మేర‌కు ప‌నులు చేయించుకుందా మ‌ని.. సెంట్రల్‌, తూర్పు నియోజ‌క‌ర్గాల్లో టీడీపీ నేత‌లు నిర్ణయించుకున్నారు. కానీ, ఎంపీగారు ఎవ‌రికీ అంద‌డం లేదు. త‌న మానాన త‌ను ప‌నులు చేసుకుని పోతున్నారు. ఎంపీ నాని గ‌ద్దె రామ్మోహన్ తో సహా ఎవ్వరిని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

అధిష్టానానికి చెప్పినా?

నాని ఇప్పట‌కీ న‌గ‌రంలో ఎక్కడా టీడీపీ నేత‌ల‌ను ఆయ‌న క‌లుపుకొని పోవ‌డం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి నిధులు రావ‌డం లేదు. అయితే.. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్ ప‌లు అభివృద్ధి ప‌నులు చేస్తున్నార‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ముందు.. ఈ ప‌నులు చేస్తూ.. వైసీపీ బోర్డు పెట్టుకుంటున్నార‌ని.. ఇది త‌న‌కు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని.. పార్టీ అధిష్టానానికి కొన్నాళ్ల కింద‌టే గ‌ద్దె రామ్మోహన్ లేఖ రాశారు. అంటే.. వైసీపీని నిలువ‌రించ‌మ‌ని.. కాదు, క‌నీసం ఇప్పటి నుంచైనా..టీడీపీ నేత‌లు క‌ల‌సి వ‌స్తే.. ముఖ్యంగా ఎంపీ నిధులు అంతో ఇంతో త‌న‌కు కేటాయిస్తే.. ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న పార్టీ అధిష్టానానికి చెప్పుకొచ్చారు.

వైసీపీలోకి వెళ్లిపోతుండటంతో…..?

కానీ, ఇప్పటి వ‌ర‌కు దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అస‌లు నానికి చెప్పే ప‌రిస్థితి కూడా లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ద్వితీయ శ్రేణి కేడ‌ర్ అంతా వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. కొంద‌రు పార్టీలోనూ ఉంటూ వైసీపీకి స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రభావం ఇటీవ‌ల కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో స్పష్టంగా క‌న‌ప‌డింది. పైగా వైసీపీ అధిష్టానం సైతం తూర్పు నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగా టార్గెట్ చేసింది. అటు అధికార పార్టీ దూకుడు, ఇటు సొంత పార్టీ నేత‌ల స‌హ‌కారం లేక‌పోవ‌డంతో త‌ను ప్రజ‌ల్లో తిరిగే ప‌రిస్థితి లేద‌ని కూడా గ‌ద్దె రామ్మోహన్ నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు.

Tags:    

Similar News