పాలిటిక్స్ నుంచి `గద్దె` ఔట్.. రీజన్ ఇదేనా..?
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, వివాద రహితుడు అయిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటారనే [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, వివాద రహితుడు అయిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటారనే [more]
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, వివాద రహితుడు అయిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటారనే గుసగుస పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సతీమణి అనురాధ కూడా రాజకీయంగా చక్రంతిప్పుతున్నారు. గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన గద్దె రామ్మోహన్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు, పట్టు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రభంజనం ఎదుర్కొని ఆయన గన్నవరంలో ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత విజయవాడ ఎంపీగా కూడా గెలిచారు. టీడీపీలోనూ గద్దె రామ్మోహన్ రాజకీయాలకు స్పెషల్ మార్కులు ఉన్నాయి.
వైైసీీపీ సునామీలోనూ….
అంతేకాదు.. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ జోరుగా వీచినా..కూడా గద్దె రామ్మోహన్ విజయం దక్కించుకుని విజయవాడలో టీడీపీ పరువు నిలిపారు. అయితే.. కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదనే వాదన ఉంది. గద్దె రామ్మోహన్ భార్య అనూరాధ విజయవాడ మేయర్ రేసులో ఉన్నా వాళ్లను బాబు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు టీడీపీ తరపున జిల్లా మొత్తం మీద పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకు బాబు, లోకేష్ వద్ద గుర్తింపు లేదు. బాబు, లోకేష్ భజన గద్దె రామ్మోహన్ పెద్దగా చేయరన్న టాక్ కూడా ఉంది.
పోటీ పడలేక…..
అదే సమయంలో ఇప్పుడున్న వైసీపీ యువ నేతలతోనూ గద్దె రామ్మోహన్ పోటీ పడలేక పోతున్నారు. మరోవైపు టీడీపీలో గ్రూపు రాజకీయాలు.. ముఖ్యంగా విజయవాడలో ఆధిపత్య రాజకీయాలు గద్దె వైఖరికి భిన్నంగా ఉండడంతో ఆయన గత కొంత కాలంగా బయటకు కూడా రావడం లేదు. కేవలం చంద్రబాబు వచ్చినప్పుడో.. లేక.. వ్యక్తిగత అజెండా ఉంటేనో.. ఆయన బయటకు వస్తున్నారు. దీనికితోడు.. ఇటీవల గద్దె ఆరోగ్యం బాగా దెబ్బతిందని.. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
భార్యను పోటీ చేయించాలని….
నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించడం లేదు. అయితే.. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ తన సతీమణి అనురాధకు టికెట్ ఇప్పించుకునే అవకాశం ఉందని అంటున్నారు .అదే సమయంలో తనకు రాజ్యసభ సీటు కోసం ఆయన ప్రయత్నించే ఛాన్స్ లేకపోలేదని గుసగుస వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. వచ్చే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నందున.. అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి