జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్‌పై వైసీపీలో హాట్ హాట్ డిబేట్‌

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌కు బెస్ట్ ఫ్రెండ్‌, ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి కీల‌క స‌మయంలో పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డం వైసీపీ వ‌ర్గాల్లోనే పెద్ద హాట్ [more]

Update: 2020-03-31 06:30 GMT

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌కు బెస్ట్ ఫ్రెండ్‌, ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి కీల‌క స‌మయంలో పూర్తిగా సైలెంట్ అయిపోవ‌డం వైసీపీ వ‌ర్గాల్లోనే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చిన‌ప్పుడు ఆయ‌న‌తో పాటు అన్ని వ‌దుల‌కుని జ‌గ‌న్ వెంట న‌డిచిన మొట్టమొద‌టి వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి మాత్రమే. శ్రీకాంత్‌రెడ్డి వైసీపీ ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అప్పటి టీడీపీ రాజ్యస‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ నుంచి పార్టీ మారేందుకు అనేక రూపాల్లో ఒత్తిడులు ఎదుర్కొన్నారు. అయినా కూడా వైసీపీలోనే ఉండి త‌న నిబద్ధత‌ను చాటుకున్న నాయ‌కుడుగా గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తింపు పొందారు. ఇక‌, గ‌త ఏడాది వైసీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు త‌న‌దైన శైలిలో వ్యవ‌హ‌రించారు.

ప్రాధాన్యత తగ్గిపోయిందని…

అంతేకాదు, ప్రతిప‌క్షంగా ఉన్నప్పుడు ఇప్పుడు అధికార ప‌క్షంగా మారిన త‌ర్వాత కూడా వైసీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌డంలోను, ప్రత్యర్థి పార్టీల‌పై విరుచుకుప‌డ‌డంలోనూ శ్రీకాంత్ రెడ్డి స్టయిలే వేరు. అయితే, ఆయ‌న వైసీపీ అధికారంలోకి రాగానే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని ఆశించారు. అయితే, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇవ్వలేక పోయారు. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ ప‌ద‌వి అప్పగించారు. త‌ర్వాత కార‌ణాలు ఏవైనా జ‌గ‌న్‌కు ఆయ‌న‌కు చిన్నపాటి గ్యాప్ అయితే వ‌చ్చింద‌ని ప్రభుత్వ.. వైసీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చలు అయితే ఉన్నాయి. దీంతో గ‌డికోట‌.. త‌న ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌నే ఫీలింగ్‌తో ఉన్నార‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. వాస్తవానికి ఆయ‌న అడ‌పాద‌డ‌పా.. మీడియా ముందుకు వ‌చ్చి పార్టీ వాయిస్ వినిపించేవారు.

రాయచోటి రాజకీయాలకే….

అయితే ఇప్పుడు గ‌తంలోలా మాత్రం శ్రీకాంత్ రెడ్డి అడ‌పాద‌డ‌పా ప్రెస్‌మీట్లు పెట్టడం మిన‌హా గ‌తంలో అంత దూకుడుగా ఉండ‌డం లేద‌నే అంటున్నారు. ఇప్పుడు కీల‌క‌మైన క‌రోనా ఎఫెక్ట్ స‌మ‌యంలో శ్రీకాంత్ రెడ్డి ఎక్కడా కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. మంత్రులు క‌న్నబాబు, ఆళ్ల నాని వంటి వారు మాత్రమే మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు త‌ప్ప.. జ‌గ‌న్‌కు అత్యంత స్నేహితుడు, ఒకే జిల్లాకు చెందిన నాయ‌కుడు, పార్టీలో సీనియ‌ర్ అయిన శ్రీకాంత్‌రెడ్డి మాత్రం మీడియా మొహం చూడ‌డం లేదు. అదేస‌మ‌యంలో జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గం రాయ‌చోటి లో రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీని అంత‌టికీ కూడా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేద‌నే ఆవేద‌నే కార‌ణమ‌ని తెలుస్తోంది.

రెండున్నరేళ్ల తర్వాత కూడా…

ఇక రెండున్నరేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రివ‌ర్గ ప్రక్షాళ‌న‌లో అయినా ఆయ‌న‌కు కేబినెట్ మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న న‌మ్మకం అయితే లేద‌ట‌. ఇప్పటికే రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఇక క‌డ‌ప జిల్లా నుంచి చూస్తే మైనార్టీ మంత్రిని త‌ప్పించాల‌నుకుంటే రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌వి కోసం కాచుకుని కూర్చొని ఉన్నారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఇవ‌న్నీ ఆలోచించే అన‌వ‌స‌ర విష‌యాల్లో తాను ఎందుకు పూసుకోవాల‌నే సైలెంట్‌గా ఉంటున్నార‌ట‌.

Tags:    

Similar News