బాధ్యత లేదా? అర్థం చేసుకోరా?

ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని మతాల దేవాలయాలు మూత పడ్డాయి. అందులో ఉండాలిసిన దేవుళ్లంతా వైద్యుల రూపంలో మన ప్రాణాలు రక్షించేందుకు ఆసుపత్రుల్లో వెలిశారు. ఇది [more]

Update: 2020-04-02 11:00 GMT

ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని మతాల దేవాలయాలు మూత పడ్డాయి. అందులో ఉండాలిసిన దేవుళ్లంతా వైద్యుల రూపంలో మన ప్రాణాలు రక్షించేందుకు ఆసుపత్రుల్లో వెలిశారు. ఇది ప్రజల్లో కరోనా వ్యాప్తి మొదలు అయినప్పుడు బాగా వైరల్ అయిన కొటేషన్. ఈ కొటేషన్ కి అంతా జై కొట్టారు కూడా. అలాంటి వైద్యులకు ఇప్పుడు కరోనా బాధితులతో కుస్తీ కూడా పట్టాలిసి వస్తుంది. తాజాగా తెలంగాణ లో వైద్యుడిపై కరోనా పాజిటివ్ బాధితుడి దాడి అందరికి షాక్ ఇచ్చింది.

గాంధీ లో కలకలం …

కరోనా బాధితులకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి పెద్ద ఎత్తున సేవలు అందిస్తుంది. 24 గంటలు తమ సమయాన్ని, ప్రాణాలను రోగులకోసం వెచ్చిస్తున్నారు వైద్యులు. ఇలా ప్రమాదకర వైరస్ వ్యాధిగ్రస్థులతో పోరాడుతున్న నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ ప్రత్యేక గదుల్లో ఉంటూ ఈ సేవలు అందిస్తున్నారు. ఇలా అహరహం శ్రమిస్తున్న వైద్యులపై తాజాగా ఒక పాజిటివ్ రోగి దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఢిల్లీ వెళ్లివచ్చిన ఒకే కుటుంబం లోని ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో ఆగ్రహించిన మరో రోగి గాంధీ లోని వైద్యుడిపై దాడికి దిగాడు. ఆసుపత్రిలో ఫర్నిచర్ ను పగలు కొట్టి వైద్యుడిని కొట్టాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కేసులు …

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు మరింత పెరిగింది. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారి తో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఎపి లో ప్రస్తుతం 111 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు పీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ లో కొత్తగా మరో 30 పాజిటివ్ కేసులు బుధవారం నమోదు కాగా మరో ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారు తెలంగాణాలో 9 మంది అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 127 కు చేరింది. తాజాగా చనిపోయిన ముగ్గురు ఢిల్లీకి వెళ్ళివచ్చినవారే.

Tags:    

Similar News