టైం వచ్చేస్తుందంట

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు గురించి త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆయ‌న టీడీపీలో ఉండ బోర‌ని, పార్టీమార‌తార‌ని, గంటాకు టీడీపీ అధినేత చంద్రబాబుకు [more]

Update: 2019-09-03 08:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు గురించి త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఆయ‌న టీడీపీలో ఉండ బోర‌ని, పార్టీమార‌తార‌ని, గంటాకు టీడీపీ అధినేత చంద్రబాబుకు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంద‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు ట్రోల్ అవుతు న్నాయి. వీటిని ఆయ‌న గ‌తంలో చాలా మేర‌కు ఖండించారు. అయితే, నెల రోజులుగా మాత్రం గంటా శ్రీనివాస‌రావు ఈ వ్యాఖ్యల‌ను ఖండించ‌డం లేదు. అలా అని ఔన‌ని కూడా చెప్పడం లేదు. మౌనం పాటిస్తున్నారు. దీంతో గంటా శ్రీనివాస‌రావు మ‌న‌సులో ఏదో రాజ‌కీయ అల‌జ‌డి చోటు చేసుకుంటోంద‌ని విశ్లేష‌కులు స‌హా ప్రధాన మీడియా కూడా పెద్ద ఎత్తున అంటోంది.

వైసీపీలోకి చేరాలనుకున్నా…

ఇటీవ‌ల రాష్ట్ర మంత్రి, వైసీపీ నాయ‌కుడు, నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీలో ఎంపీ గా ఉన్న అవంతి శ్రీనివాస్‌.. ప‌రోక్షంగా గంటా శ్రీనివాస‌రావు వైసీపీలో కివ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు. అలాగే మ‌రో టాక్ కూడా వినిపించింది. త్వర‌లోనే గ్రేటర్ విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గంటా శ్రీనివాస‌రావును వైసీపీలోకి తీసుకు వెళ్లే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక అవంతి గంటా శ్రీనివాస‌రావుపై చేసిన వ్యాఖ్యలు చూస్తే గంటా శ్రీనివాస‌రావు త‌మ పార్టీలోకి వ‌స్తాన‌న్నా జ‌గ‌న్ ద్వారాలు మూసే ఉంచార‌న్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కూడా అవంతి చుర‌క‌లు అంటించారు.

ప్రయత్నాలయితే ప్రారంభించారట….

దీనికి ప్రధానంగా ఓ రెండు వారాల కింద‌ట గంటా శ్రీనివాస‌రావు విశాఖ‌ను వాణిజ్యరాజ‌ధానిగా ప్రక‌టించాలంటూ.. జ‌గ‌న్‌కు స‌ల‌హాలు ఇచ్చారు. వాస్తవానికి అమ‌రావ‌తి రాజ‌ధానిని త‌ర‌లించ‌వ‌ద్దంటూ.. టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తుంటే.. దీనికి భిన్నంగా ఆయ‌న ఇలా వ్యాఖ్యలు చేయ‌డంతోనే గంటా శ్రీనివాస‌రావు టీడీపీకి దూర‌మ‌వుతున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అవంతి కూడా స్సందించారు. గంటా శ్రీనివాస‌రావు వ‌చ్చినా తీసుకునేందుకు త‌మ పార్టీ అధినేత సిద్ధంగా లేర‌ని చెప్పుకొచ్చారు. దీంతో గంటా శ్రీనివాస‌రావు చేస్తున్న ప్రయ‌త్నాల‌పై ఒకింత న‌మ్మకం వ‌చ్చేసింది.

బీసీలకు అన్యాయం చేశారంటూ….

క‌ట్ చేస్తే.. తాజాగా ఉత్తరాంధ్ర రాజ‌కీయాల‌పై మాట్లాడిన గంటా శ్రీనివాస‌రావు మ‌రింత ఆశ్చర్యక‌ర‌మైన వ్యాఖ్యలు చేశారు. అవి కూడా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ఆయ‌న విరుచుకుప‌డినంత ప‌నిచేశారు. దీనిలో భాగంగా బీసీల‌కు చంద్రబాబు అన్యాయం చేశార‌ని ఆయ‌న నోటి నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. బీసీలకు టికెట్ల విష‌యంలో చంద్రబాబు చేసిన అన్యాయం కార‌ణంగానే పార్టీ ఓడిపొయింద‌ని గంటా శ్రీనివాస‌రావు చెప్పారు. విజ‌య‌న‌గ‌రం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత‌కు టికెట్ ఇవ్వక‌పోవ‌డం దీనికి నిద‌ర్శన‌మ‌ని కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుసెలవిచ్చారు.

బాబుపై వ్యతిరేక వ్యాఖ్యలతో…..

ప్రస్తుతం టీడీపీ కులాల కురుక్షేత్రంలో చిక్కుకుని రెడ్డి, కాపు వ‌ర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక‌త ఎదుర్కొంటున్న క్రమంలో గంటా శ్రీనివాస‌రావు చేసిన బీసీ వ్యాఖ్యలు మ‌రింత‌గా అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టేన‌ని అంటున్నారు. అయితే, ఇదంతా కూడా జ‌గ‌న్‌కు చేరువ‌య్యే క్రమంలో గంటా శ్రీనివాస‌రావు తీసిన మ‌రో తెర‌గా చెప్పే వారు కూడా క‌నిపిస్తున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాస‌రావు నోటి వెంట బాబు వ్యతిరేక మాట రావ‌డం మాత్రం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన గంటా శ్రీనివాస‌రావుకు మ‌రోసారి పార్టీ మార‌డం కొత్తకాద‌నే వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక ఎన్నిక‌లు ముగిసిన‌ప్పటి నుంచే గంటా శ్రీనివాస‌రావు పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. బాబు స‌మావేశాల‌కు కూడా రావ‌డం లేదు. ఇప్పుడు బాబునే టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఆయ‌న‌కు పార్టీలో ఉండేందుకు ఇష్టంగా లేద‌న్న అంశాన్ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టిన‌ట్లయ్యింది.

Tags:    

Similar News