గంటా రాజీనామా…. అసలు కారణం అదేనా?

గంటా శ్రీనివాసరావు. రాజకీయాల్లో తన ట్రెండ్ ని కచ్చితంగా ఫాలో అవుతాననే అంటున్నారు. గెలిచిన పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయగలం, ఇదే గంటా మార్క్ పొలిటికల్ [more]

Update: 2020-07-30 05:00 GMT

గంటా శ్రీనివాసరావు. రాజకీయాల్లో తన ట్రెండ్ ని కచ్చితంగా ఫాలో అవుతాననే అంటున్నారు. గెలిచిన పార్టీలో ఉంటేనే ప్రజలకు మేలు చేయగలం, ఇదే గంటా మార్క్ పొలిటికల్ ఫిలాసఫీ. మామూలుగా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది. ఇక గంటా వంటి రాజకీయ యోధుడు అన్ని పార్టీలకు కావాల్సిన అత్యవసర‌ పొలిటికల్ కమోడిటీ. అందువల్ల ఆయన ఎన్ని సార్లు ఎన్ని పార్టీలు మారినా తీసుకునే వారుంటారు. అది జరిగినపుడు గంటా శ్రీనివాసరావు వెళ్ళడంలో తప్పు లేదు, తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. జనం కూడా ఆయన్ని అన్నీ తెలిసే ఆదరిస్తున్నారంటే ఆయన పొలిటికల్ హీరోయేగా.

జగన్ చేతుల మీదుగా ….

ఇప్పటిదాకా జగన్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు తప్ప కండువాలకు కప్పలేదు. ఆ కండువా సీన్ గంటాతోనే మొదలుకాబోతోందిట. గంటా శ్రీనివాస్ ఆగస్ట్ 9న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారుట. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. ఇక జగన్ గంటా శ్రీనివాసరావు చేరికకు డైరెక్ట్ గానే లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయనే సర్వాధినేత. ఎవరి అలకలు, అగచాట్లతో సంబంధమే లేదు. సో గంటా చేరిక రాజమార్గం ద్వారానే జరిగిపోతోంది అన్న మాట.

ఎమ్మెల్యేకి గుడ్ బై …..

ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీతో ఎటువంటి గతజల సేతు బంధనాలూ ఉంచుకోవాలనుకోవడంలేదు. తాను వైసీపీలో చేరదలచుకున్నారు కాబట్టి టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు. అది కూడా ఆయన పార్టీ కండువా కప్పుకోవడానికి ముందే అని కూడా చెబుతున్నారు. బహుశా ఇవాళ రేపట్లో గంటా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా అంటున్నారు. దాంతో అటు చంద్రబాబు కానీ ఇటు తమ్ముళ్ళు కానీ ఎవరూ కిక్కురుమనడానికి లేకుండా గంటా పక్కాగా తన ప్లాన్ అమలుచేస్తున్నారని అంటున్నారు.

బిగ్ షాక్…

గంటా శ్రీనివాసరావు చేరిక వల్ల ఇటు వైసీపీలో బాధితులు చాలా మంది అవుతారు. ఆయన రాజకీయ ప్రభ అలాంటిది, గంటా వంటి బలమైన నాయకుడి చేరికతో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల రాజకీయాల్లోనూ పెను మార్పులు వస్తాయని అంటున్నారు. అంతే కాదు, ఆయన సన్నిహితులు, సహచరులు పెద్ద సంఖ్యలో వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు అనుసరించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో గంటాను అనుసరిస్తారని చెబుతున్నారు. దాంతో వైసీపీకి కొత్త బలం వస్తే ఆ మేరకు టీడీపీ చిత్తు కావడం ఖాయమని కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే గంటా శ్రీనివాసరావు రాకతో వైసీపీలో ఆయనే బిగ్ షాట్ అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో అటు టీడీపీ, ఇటు వైసీపీలోని పాత కాపులంతా భారీ షాక్ కి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News