గంటాను అలా వదిలేశారేంటో…?

అధికారికంగా విడాకులు అయిపోయాయా లేక కావాలని ఆయనే వెనక్కు తగ్గారా అన్నది తెలియడంలేదు కానీ తెలుగుదేశం పార్టీలో పదవులు సందడి ఒక రేంజిలో సాగుతూండగా సీనియర్ నేత [more]

Update: 2020-10-27 00:30 GMT

అధికారికంగా విడాకులు అయిపోయాయా లేక కావాలని ఆయనే వెనక్కు తగ్గారా అన్నది తెలియడంలేదు కానీ తెలుగుదేశం పార్టీలో పదవులు సందడి ఒక రేంజిలో సాగుతూండగా సీనియర్ నేత బిగ్ షాట్ గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఏ ఒక్క పదవినీ పార్టీ కట్టబెట్టలేదు. ఆయన టీడీపీ ఉండరని అనుమానంతోనా మరోటోనా తెలియదు కానీ పదవులు మాత్రం ఆయనకు లేవు అనే పక్కాగా చెబుతున్నట్లుగా సీన్ ఉంది. ఆ మాటకు వస్తే టీడీపీలో చాలా మంది పక్క చూపులు చూసిన వారే. వారిలో అత్యధికులకు పార్టీలో కీలక స్థానాలు కూడా ఇచ్చి మరీ చంద్రబాబు గౌరవించారు. మరి వారికి లేని బాధ గంటా శ్రీనివాసరావు విషయంలోనే ఎందుకు అన్నదే ఇక్కడ ప్రశ్న.

జూనియర్ అయినా…..

విశాఖ జిల్లాలో తెలుగు మహిళా ప్రెసిడెంట్ గా వంగలపూడి అనిత ఉన్నారు. ఆమె ఒకపుడు గంటా శ్రీనివాసరావు కోటరీలోనే ఉండేవారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది గంటా అని కూడా అంటారు. అటువంటి ఆమెను పొలిటి బ్యూరోలోకి చంద్రబాబు తీసుకున్నారు. ఇదే జిల్లా నుంచి శాశ్వత పొలిటి బ్యూరో మెంబర్ గా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఇక మరో వైపు చూసుకుంటే విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కళా వెంకటరావుకు చోటు ఇచ్చారు. ప్రతిభా భారతిని ఏకంగా జాతీయ ఉపాధ్యక్షురాలిని చేశారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం అచ్చెన్నాయుడుకు ఇచ్చారు. జూనియర్ ఎర్రన్నాయుడుకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇలా అందరికీ పెద్ద మనసుతో పార్టీ పదవులు పంచేసిన బాబుకు గంటా శ్రీనివాసరావు కనిపించకపోవడం అంటే ఆశ్చర్యమే అంటున్నారు.

పిలవడంలేదా….?

మరో వైపు విశాఖలో పార్టీ కార్యక్రమాలు జరిగినా కూడా గంటా శ్రీనివాసరావును పిలవడంలేదా ఆయన వెళ్లడం లేదా అన్న చర్చ అయితే తమ్ముళ్ల మధ్యన వస్తున్నాయి. గంటా ఒక్కరికే కాదు, ఆయన బ్యాచ్ అనుకున్న వారిని కూడా కావాలనే దూరం పెడుతున్నారు. గంటా శ్రీనివాసరావుతో చనువుగా ఉంటాడనే కారణంగా విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల నాయుడుని జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇవ్వకుండా సైడ్ చేశారని కూడా వినిపిస్తున్న మాట. మరి విశాఖలో కూడా గంటా శిష్యులు, సహచరులు చాలా మంది ఉన్నారు. వారిని కూడా పార్టీ దూరం పెడుతోంది. మరి ఇవన్నీ ఏ రకమైన సంకేతాలో అర్ధం కావడం లేదని మాజీ మంత్రి వర్గీయులు అంటున్నారు.

పొగ పెట్టేశారా …?

గంటా శ్రీనివాసరావు మీడియాతో ఎపుడూ ఒకటే మాట అంటారు. మీరు నేను పార్టీ మారుతున్నాను అని రాస్తున్నారు. అది తప్పు, నేను ఒకవేళ పార్టీ మారితే ఆ విషయం మీకు చెప్పే చేస్తాను అని కూడా క్లారిటీగా చెబుతూ వచ్చారు. మరి గంటా నోటి వెంట ఇంతవరకూ పార్టీ మారుతాను అని ఎక్కడా ఒక్క ముక్క కూడా రాలేదు. కానీ టీడీపీ మాత్రం ఆయన మావాడు కాదు అనేసుకుందా అన్న చర్చ అయితే ఉంది. మరి గంటా శ్రీనివాసరావు ఇపుడు వేరే ప్రయత్నాలు చేస్తున్నాఒకవేళ అవి మానుకుని టీడీపీలో ఉన్నా అది కుదిరే పనేనా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా గంటా వ్యతిరేకులంతా కలసి బాబుతో చెప్పి మరీ పొగపెడుతున్నారా అన్న సందేహాలు అయితే ఆయన వర్గంలో వస్తున్నాయిట.

Tags:    

Similar News