కంఫర్ట్ గా అయితే లేరట

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన టీడీపీలో కొనసాగుతారా? వెళ్లిపోతారా? అన్న సందిగ్దం నేటికీ వీడలేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు చేయని [more]

Update: 2019-10-24 15:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన టీడీపీలో కొనసాగుతారా? వెళ్లిపోతారా? అన్న సందిగ్దం నేటికీ వీడలేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. అధికారానికి దూరంగా గంటా శ్రీనివాసరావు ఉండలేరన్నది అందరికీ తెలిసిందే. గంటా శ్రీనివాసరావు ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన నేత కావడంతో ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ పర్చక తప్పదు. కానీ గత నాలుగు నెలలుగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారని జరుగుతున్న ఊహాగానాలకు అయితే నేటికీ ఫుల్ స్టాప్ పడలేదు.

చిరునవ్వే సమాధానం…

ఇంతకీ గంటా శ్రీనివాసరావు మదిలో ఏముంది. సాధారణంగా గంటా శ్రీనివాసరావు మొన్నటి వరకూ పార్టీ మారతారన్న ప్రశ్నలకు మీడియా సమావేశాల్లో మారేపనైతే ముందు మీకే చెప్తాను అనే వారు. గతకొద్దిరోజులుగా గంటా శ్రీనివాసరావు ఈ ప్రశ్నకు చిరునవ్వే సమాధానంగా ఇస్తున్నారు. నిజానికి గంటా శ్రీనివాసరావు పార్టీ మారే నిర్ణయం మార్చుకున్నారన్న వాదన కూడా వచ్చింది. విశాఖలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఒక రోజంతా గంటా శ్రీనివాసరావు చంద్రబాబు పక్కనే కూర్చున్నారు. కానీ తాను ప్రాతినిధ్యం వహించే విశాఖ ఉత్తరం నియోజకవర్గ సమీక్ష కు మాత్రం గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది.

వైసీపీలోకా?

గంటా శ్రీనివాసరావు మనసంతా వైసీపీ పైనే ఉంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని ఆయన గతకొద్దిరోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కూడా మంతనాలు సాగించారు. గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవితో కూడా రాయబారం సాగించినట్లు చెబుతున్నారు. అయితే దీనికి ముందుగానే నాలుగునెలల్లో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీడ్ బ్యాక్ ను కూడా గంటా శ్రీనివాసరావు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరేందుకే గంటా శ్రీనివాసరావు మొగ్గు చూపుతున్నప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపైనే ఆయన ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.

ఆఫర్ ఉన్నప్పటికీ…..

మరోవైపు బీజేపీ నుంచి కూడా గంటా శ్రీనివాసరావుకు ఆఫర్ ఉంది. ఇటీవల విశాఖకు వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి వెళితే రాజ్యసభ ఇవ్వాలని కూడా గంటా శ్రీనివాసరావు కోరినట్లు చెబుతున్నారు. పార్టీమారితే అనర్హత వేటు పడకుండా మరికొందరు ఎమ్మెల్యేలు వస్తారేమోనని గంటా శ్రీనివాసరావు వెయిట్ చేశారట. అయితే అందుకు ఎవరూ సుముఖంగా లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు ఒక్కరే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో శత్రువులు ఎక్కువ కావడం, ఆ పార్టీకి భవిష్యత్ లేదని భావించి గంటా శ్రీనివాసరావు త్వరలోనే పార్టీ మారతారన్నటాక్ అయితే బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News