ఇప్పటికైనా కళ్లు తెరవాలి… పాఠాలు నేర్చుకోకుంటే?

విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటన అనేక పాఠాలు నేర్పుతుంది. అభివృద్ధి, ఉపాధి, అవసరమే. కానీ మానవ జీవితాలే ఫణంగా పెట్టే అభివృద్ధి అవసరమా? అనే చర్చ [more]

Update: 2020-05-08 09:30 GMT

విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటన అనేక పాఠాలు నేర్పుతుంది. అభివృద్ధి, ఉపాధి, అవసరమే. కానీ మానవ జీవితాలే ఫణంగా పెట్టే అభివృద్ధి అవసరమా? అనే చర్చ కు విశాఖ సంఘటన తెరతీసింది. ఆధునికత వైపు అడుగులు వేస్తున్న మానవ జీవితం ప్రమాదాల చెంతనే పయనిస్తోంది. రసాయనాలతో సావాసం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను పర్యవేక్షించాలన్న డిమాండ్ ఇప్పుడు వినిపిస్తుంది.

చేతులు కాలాక …

చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా కాకుండా ముందే కళ్ళు తెరిచి పరిశ్రమల్లో భద్రత అంశాలు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరగాలి. అయితే లంచగొండితనం రాజ్యమేలుతున్న దేశంలో ఈ పర్యవేక్షణ గాలి కబుర్లే. ప్రమాదం ఏదైనా జరిగితే సంబంధిత సంస్థలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కొంతకాలం గడిచాక తిరిగి అంతా షరా మామూలే. దీనివల్లే వ్యవస్థలపట్ల వాటిని నడిపే వ్యక్తుల పట్ల ప్రజల్లో చులకన భావమే నేటికి నడుస్తుంది.

లంచాలు అరికట్టకపోతే …

పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు పరిశ్రమల శాఖ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. వీరు ఇచ్చే ఎన్ ఒ సి లు అంతా లాబీయింగ్ లంచాలతోనే సాగుతాయన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా సర్కార్ కళ్ళు తెరవాలిసివుంది. జరిగిన నష్టం ఎలాగూ జరిగింది. భవిష్యత్తులో అయినా అవినీతి రహిత పాలనపై దృష్టి పెట్టడంతో పాటు లంచగొండులను ఏరిపారేయకపోతే విశాఖ గ్యాస్ లీక్ వంటి ప్రమాదాలు పరిశ్రమలు ఉన్న ప్రతీ చోటా ఎదో సందర్భంలో ఎదురుకాక తప్పదు.

Tags:    

Similar News