గోకరాజు గోల లేదెందుకబ్బా?
ప్రముఖ పారిశ్రామికవేత్త, నరసాపురం మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు ఎక్కడా కనిపించడం లేదు. 2014లో ఆయన టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్‌ను [more]
ప్రముఖ పారిశ్రామికవేత్త, నరసాపురం మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు ఎక్కడా కనిపించడం లేదు. 2014లో ఆయన టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్‌ను [more]
ప్రముఖ పారిశ్రామికవేత్త, నరసాపురం మాజీ ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజు ఎక్కడా కనిపించడం లేదు. 2014లో ఆయన టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్‌ను కైవసం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటు కోసం పొత్తులో భాగంగా బీజేపీ నుంచే చాలా మంది ప్రయత్నాలు చేసినా చివరకు ఆర్ఎస్ఎస్ కోటాలో గోకరాజు గంగరాజుకే దక్కింది. అయితే, తర్వాత కాలంలో ఆయన అదే జిల్లా తుందుర్రు ఆక్వా పరిశ్రమ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజలు వద్దని మొర పెట్టుకున్నా.. గోకరాజు గంగరాజు పట్టించుకోకుండా ముందుకు కదిలారు.
ఎందుకని అలా…..
తాను అనుకున్నది చేయడంలోను, ప్రభుత్వాల నుంచి పనులు చేయించుకోవడంలోనూ ముందుంటారు అలాంటి గోకరాజు గంగరాజు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, ఆయన వారసుడిని రంగంలోకి దింపాలని చూసినా.. అది ఫలించలేదు. రాష్ట్రంలో బీజేపీఒక్క సీటు తెచ్చుకోకపోయినా.. గోకరాజు గంగరాజు హవా మాత్రం సాగుతుందని చెప్పుకొనే ఆయన అనుచరులు కూడా ఇప్పుడు గోకరాజు గంగరాజు అడ్రస్ లేకుండా పోయే సరికి ఆలోచనలో పడిపోయారు.
జగన్ ప్రభుత్వంపై…..
ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానది పరివాహకం సమీపంలోని భవనాల పై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు గత ముఖ్యమంత్రిగా నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూలగొట్టింది. ఇక, ఆ వెంటనే ఈ కట్టవెంబడి ఉన్న నివాసాలను, కట్టడాలను కూడా కూలగొట్టాలని నిర్ణయించుకుంది. ఈ కట్టవెంబడి గోకరాజు గంగరాజు కు సంబంధించి పెద్ద భవనం కూడా ఉండడం గమనార్హం. దీంతో జగన్ ప్రభు త్వం దీనికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై కూడా గోకరాజు గంగరాజు ఎక్కడా విమర్శలకు దిగలేదు. నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే కేంద్రంలో చక్రం తిప్పారని అంటు న్నారు. మొత్తంగా ఈ విషయంపై జగన్ సర్కారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటే.. గోకరాజు గంగరాజు కూడా అదే రేంజ్‌లో జగన్ ప్రభుత్వంపై ఒక్కమాటంటే ఒక్కమాట కూడా మాట్లాడడంలేదు. ఈ క్రమంలోనే గోకరాజు గంగరాజు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. మరి ఆయన ఎందుకు మౌనం పాటిస్తున్నారనే విషయం పెద్దగా ఎవరికీ తెలియంది కాదని అంటున్నారు ఆయన అనుచరులు. ఇది నిజమేనా.
వ్యాపారాలపైనే….
ఇక ప్రస్తుతం గోకరాజు గంగరాజు బీజేపీలోనే ఉన్నా ఆయన మళ్లీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే ఛాన్సులు కూడా లేవు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో అంతా వలసవాదుల రాజ్యం ఏలుతోంది. కంభంపాటి హరిబాబు లాంటి నేతలకే పదవులు వచ్చే పరిస్థితి లేదు. ఇక గోకరాజు గంగరాజు కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండడంతో పదవులకు ఆశ పడకుండా తన వ్యాపార అవసరాల కోసం వాడుకుంటే చాలన్నట్టుగా ఉన్నట్టే కనిపిస్తోంది.