ఈ వైసీపీ ఎంపీని జగన్ కంట్రోల్ చేసేనా ?
వైసీపీలో సమీకరణలు మారుతున్నాయి. పనిచేసే వారికే కాదు.. ప్రజాదరణ ఉన్న నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో సీట్లు [more]
వైసీపీలో సమీకరణలు మారుతున్నాయి. పనిచేసే వారికే కాదు.. ప్రజాదరణ ఉన్న నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో సీట్లు [more]
వైసీపీలో సమీకరణలు మారుతున్నాయి. పనిచేసే వారికే కాదు.. ప్రజాదరణ ఉన్న నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో సీట్లు దక్కించుకున్న చాలా మందికి ఈ సారి అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న వారు నాయకులుగా తమదైన ముద్ర వేసుకోకుండా పార్టీకి కంట్లో నలుసుగా మారారనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ.. గోరంట్ల మాధవ్.
పోలీసు శాఖ నుంచి…
గత ఎన్నికలకు ముందు వరకు పోలీస్ జాబ్‌లో ఉన్న గోరంట్ల మాధవ్ అనూహ్యంగా వైసీపీలోకి రావడం.. ఆ వెంటనే ఎంపీ టికెట్ దక్కించుకోవడం.. జరిగిపోయాయి. ఇక, జగన్ సునామీలో ఆయన విజయం కూడా దక్కించుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు.. నిమ్మల కిష్టప్పపై గోరంట్ల మాధవ్ గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన కొన్నాళ్లుగా పార్టీలోను, నియోజకవర్గంలోనూ వివాదం అయ్యారు. తన మాటే నెగ్గాలనే ధోరణితో ముందుకు సాగుతున్నారని .. కింది స్థాయి నేతలకు ఆయన విలువ ఇవ్వడం లేదని.. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
పార్లమెంటు వ్యవహారాల్లోనూ….
ఇక, పార్లమెంటు వ్యవహారాల్లోనూ గోరంట్ల మాధవ్ పై పార్టీ అగ్రనేతలు.. అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. సరైన విధంగా పార్లమెంటులో గళం వినిపించకపోవడం.. సమస్యలపై పట్టు లేకపోవడంతో పార్లమెంటులో గోరంట్ల మాధవ్ కు మార్కులు రావడం లేదట. సీనియర్లతోనూ ఆయన కలివిడిగా ఉండలేక పోతున్నారని.. విమర్శలు వస్తున్నాయి. అదే సయమంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెత్తనం చేస్తున్నారని.. ఎమ్మెల్యేలను పట్టించుకోవడం మానేశారని.. పార్టీ నేతలతో మాట్లాడడమే అరుదుగా ఉందని చెబుతున్నారు.
సీనియర్ నేతల గుస్సాతో….
ఈ పరిణామాలపై పార్టీలో కొందరు సీనియర్లు.. గుస్సాగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురంలో గత ఎన్నికల్లో గెలిచామనే ధీమా సరిపోదని.. ఎప్పటికప్పుడు అప్రమత్తగా వ్యవహరించాలని.. అంటున్నా.. ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం తన శైలిని మార్చుకోవడం లేదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ జేసీ కుటుంబం తోనూ.. వివాదాలకు రెడీ కావడం.. పార్టీని ఇబ్బంది పెట్టడమే అవుతుందని అంటున్నారు పార్టీ నేతలు. దీనికి తోడు తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. రెండు నియోజకవర్గాల పేర్లు కూడా మీడియాకు లీకులు ఇస్తుండడం అక్కడ నేతల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. మరి జగన్ ఆయన్ను కంట్రోల్ చేయకపోతే ఆయన అతి పార్టీకి నష్టం కలిగించడం ఖాయంగా ఉంది.