క్లీన్ స్వీప్ చేసిన చోట కూడా కోలుకోలేని దెబ్బేనా?
ఏమాటకామాట చెప్పుకోవాలి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, జగన్‌ను సీఎంను చేసేందుకు వారంతా కలిసికట్టుగా కృషి చేశారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు [more]
ఏమాటకామాట చెప్పుకోవాలి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, జగన్‌ను సీఎంను చేసేందుకు వారంతా కలిసికట్టుగా కృషి చేశారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు [more]
ఏమాటకామాట చెప్పుకోవాలి. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, జగన్‌ను సీఎంను చేసేందుకు వారంతా కలిసికట్టుగా కృషి చేశారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో బాగా కష్టపడ్డారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. మరి ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారని ఎవరైనా భావిస్తారు. కానీ, పరిస్థితి మాత్రం ఇలా లేదు. ఎక్కడికక్కడ నాయకుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల నిన్న మొన్నటి వరకు తెరమరుగుగా ఉన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా రచ్చకెక్కాయి. దీంతో అసలు పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. మరోపక్క, వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన నాయకులను ఏమీ అనలేక కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే, పరిస్థితులను మాత్రం ఆయన గమనిస్తున్నారు.
పరోక్ష హెచ్చరికలు చేస్తున్నా…
ఈ క్రమంలోనే పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. పార్టీని డెవలప్ చేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ప్రజల మధ్య పార్టీకి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోండి అని ఆయన చెబుతూనే ఉన్నారు. అయినాకూడా కొందరు నాయకులు మాత్రం పంథాను మార్చుకోకపోవడం ఇప్పుడు తీవ్ర వివాదానికి, విభేదాలకు కారణం అవుతోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నా యి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే తరహా వైసీపీ పంచాయితీలు సాగుతున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీ పరిస్థితి కొంత డోలాయమానంలో పడిందనే భావన కలుగుతోంది. రాజధాని జిల్లా గుంటూరు నుంచి ఎక్కడో ఉన్న కర్నూలు వరకు కూడా ఇదే పరిస్థితి తెరమీద కనిపిస్తోంది. నాయకుల మధ్య తీవ్ర విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. వీరిలో సీనియర్ల కన్నా జూనియర్లు తలబిరుసుగా వ్యవహరిస్తుండడం పార్టీలో చర్చకు దారితీస్తోంది.
గుంటూరుః రాజధాని జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కొత్తగా గెలిచిన నాయకులు అంతా తామే అయి వ్యవహరిస్తున్నారు. వీరిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మరింతగా వివాదాస్పదం అవుతున్నారు. ఇక, ఎంపీ నందిగం సురేశ్ కూడా ఇదే బాట పట్టారు. ఆయన ఉండవల్లితో తీవ్రంగా విభేదిస్తున్నారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు సైలెంటయినా, లోలోపల వారిద్దరూ ఇంకా రగిలిపోతూనే ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
తూర్పుగోదావరి: టీడీపీకి అత్యంత పట్టున్న జిల్లాలో వైసీపీ పాగా వేసింది. అయితే, ఆ సంతోషం స్వల్ప కాలంలోనే ఆవిరి అవుతున్నట్టు తెలుస్తోంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు కొన్నాళ్ల కిందట టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. అయితే, ఈయన రాకను వైసీపీ నాయకులు ఇష్టపడలేదు. అయినా జగన్ చేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ తోట కేంద్రంగా విభేదాలు తారస్తాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తోట వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల ఏకంగా ఓ వ్యక్తి చెప్పుతో తోటను కొట్టబోయాడు కూడా.
ప్రకాశం: ఈ జిల్లాలోనూ వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నా నాయకుల మధ్య మాత్రం వడగాల్పులు వీస్తున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకీ మధ్య పోటీలు, పంతాలు పెరిగిపోతున్నాయి. అటు ఎంపీకి మంత్రి బాలినేనికి పడడం లేదు. చీరాలలో ఆమంచికి, ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీతకు పడడం లేదు.
కర్నూలు: ఈ జిల్లాలో మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయినా ఆ సంతోషం కనిపించడం లేదు. నాయకులు ఎవరికి వారు ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తూ పార్టీని వివాదంలో పడేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది.ఎమ్మెల్యే హఫీజ్‌కు తెలీకుండా, నియోజకవర్గంలో వలసలను ప్రోత్సహిస్తున్నారట ఎస్వీ. అధికారులను సైతం ప్రభావితం చేస్తున్నారట. దీంతో వీరి పంచాయితీ ఏకంగా సీఎం జగన్ దగ్గరకు వెళ్లింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌కు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి పొసగడం లేదు.
విజయవాడ: నగరంలోని మూడు నియోజకవర్గాల్లో వైసీపీ రెండు చోట్ల గెలిచింది. అయితే, వీరిలో పశ్చిమం నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాస్‌కు మంత్రిపదవి దక్కింది. దీంతో ఆయన సర్వం నాదే అన్నట్టుగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యేకి ఆయనకు అస్సలు పడడం లేదని సమాచారం. ఇక గుడివాడలో వైసీపీకి సపోర్ట్ చేస్తోన్న ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావుకు, విజయవాడ తూర్పులో బొప్పన భవకుమార్‌కు, అవినాష్‌కు కూడా తీవ్రమైన గ్యాప్ ఉంది.