ఏకులా వ‌చ్చి మేకులవుతున్న నేత‌లు.. జ‌గ‌న్ ఏం చేస్తారు..?

రాజ‌కీయాల్లో ఎవ‌రు పెద్ద.. ఎవ‌రు చిన్న.. ఎవ‌రు చెప్పింది ఎవ‌రు ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ర‌గ‌డ నేప‌థ్యంలో [more]

Update: 2020-06-24 15:30 GMT

రాజ‌కీయాల్లో ఎవ‌రు పెద్ద.. ఎవ‌రు చిన్న.. ఎవ‌రు చెప్పింది ఎవ‌రు ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ర‌గ‌డ నేప‌థ్యంలో తెరమీదికి వ‌చ్చిన వివాదాలు ఇవి! వాస్తవానికి అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్కలేద‌నో.. లేదా ప‌క్కవాళ్లు ద‌క్కించుకున్నార‌నో.. లేదా త‌మ‌వారికి కాంట్రాక్టులు ద‌క్కలేదనో.. పేచీ పెట్టే నాయ‌కులు స‌హ‌జం. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నాయ‌కులు ఇలానే పేచీలు పెట్టారు. అయిన‌ప్పటికీ.. పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అధినేత చెప్పిన‌ట్టు.. పార్టీలైన్‌కు త‌గిన‌ట్టు వ్యవ‌హ‌రించారు.

వైసీపీ ప్రారంభం నుంచి…..

కానీ, ఇప్పుడు వైసీపీలో అంత‌కు మించి అనే రేంజ్‌లో దాదాపు స‌గానికిపైగా జిల్లాల్లో నాయ‌కులు రెచ్చిపోతున్నారు. వీరిలో కొందరు ఎంపీలు ఉండ‌గా.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వీరి గురించే పెద్ద ఎత్తున రాజ‌కీయాల్లో చ‌ర్చ లేచింది. వీరంతా కూడా వైసీపీ ప్రారంభం నుంచి ఉన్న నాయ‌కులు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ముందు కేవ‌లం టికెట్ల కోసం పార్టీలోకి వ‌చ్చి.. పార్టీ ప‌రువును తీస్తున్నార‌నే వాద‌న కూడా తెర‌మీద‌కి వ‌చ్చింది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుంచి విజ‌యం సాధించించిన ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.. కొన్నాళ్ల కింద‌ట ఇలానే వివాదం సృష్టించారు. ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఏడాది అయినా.. అభివృద్ధి ఎక్కడా? అని బ‌హిరంగంగానే ప్రశ్నించారు.

టిక్కెట్ దక్కితే చాలంటూ…..

ఆయ‌న ఎంతో సీనియ‌ర్‌. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని.. త‌న‌కు ప్రయార్టీ ఉండ‌డం లేద‌ని వీలున్నప్పుడ‌ల్లా ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి గెలిచిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. నిజానికి వీరంతా కూడా ఏ పార్టీలోనూ టికెట్ ల‌భించ‌క వైసీపీ గూటికి చేరి.. టికెట్ ద‌క్కితే చాల‌ని ఎదురు చూసిన వారే! అయితే, ఇప్పుడు మాత్రం ఇలా మేకుల్లా మారి పార్టీ ప‌రువును తీస్తున్నార‌నే వాద‌న బలంగా వినిపిస్తోంది.

కొత్తగా వచ్చి చేరి….

ఇప్పుడు త‌మ‌కేదో.. తీవ్ర అన్యాయం జ‌రిగిపోతోంద‌ని, త‌మ‌పై పార్టీలో వివ‌క్ష ఉంద‌ని చెప్పుకొంటున్న ఈ నాయ‌కులు ఏనాడైనా పార్టీ కోసం ఏ చిన్న ప‌నైనా చేశారా? అనేది వైసీపీలో ఆది నుంచి ఉన్న నాయ‌కులు సంధిస్తున్న ప్రశ్న. పార్టీలో ఆది నుంచి ఉన్న త‌మ‌ను కూడా కాద‌ని.. వీరికి జ‌గ‌న్ టికెట్లు ఇచ్చి.. గెలిపించార‌ని, కానీ, ఇప్పుడు ఇలా వ్యవ‌హ‌రించ‌డం వ‌ల్ల పార్టీని న‌ష్టప‌ర‌చ‌డం కాదా ? అని అంటున్నారు. ఈ వాద‌న చూస్తే.. నిజ‌మే క‌దా ? అని అనిపిస్తుండడం గ‌మ‌నార్హం.

ఎన్నికలకు ముందే…

ఎన్నిక‌ల‌కు ముందు ఏకుల్లా వ‌చ్చి.. ఇప్పుడు మేకుల్లా త‌యార‌వ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మో వారే నిర్ణయించుకోవాల‌ని సూచిస్తున్నారు. ఏదైనా లోటు పాట్లు ఉంటే.. అధిష్టానానికి చెప్పుకోవాలి. ఈ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాలి. జ‌గ‌న్ ఎంత కృషి చేసి క‌ష్టప‌డితే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చింది.. అనే కీల‌క విష‌యాన్ని వైసీపీ నేతలు విస్మరిస్తున్నార‌నే వాద‌నను వీరు చెవికెక్కించుకుంటే బెట‌ర‌న్న టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News