టీడీపీ, వైసీపీలో కాన‌రాని సంతోషం డల్ గా ఉన్నారెందుకో ?

అటు అధికారంలో ఉన్న వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఎవరూ సంతోషంగా లేరు అనే చెప్పాలేమో. ఏపీలో పవర్ లో ఉన్నామన్న నిబ్బరం కానీ, ధీమా [more]

Update: 2021-09-11 13:30 GMT

అటు అధికారంలో ఉన్న వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ ఎవరూ సంతోషంగా లేరు అనే చెప్పాలేమో. ఏపీలో పవర్ లో ఉన్నామన్న నిబ్బరం కానీ, ధీమా కానీ వైసీపీ ఎమ్మెల్యేలలో ఎక్కడా లేదు. అంతా తానై నడిపించేస్తున్నారు జగన్. ఆయన మొత్తం అధికారులనే నమ్ముకున్నారు. పైగా తన బ్రైయిన్ చైల్డ్ గా సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇక వ‌లంటీర్లను కూడా ముందు పెట్టుకుని పధకాలను వారితోనే కథ‌ నడిపించేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఇక ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎందుకు, వారి అధికారాలు ఎందుకు. కనీసం పంచాయతీ వార్డు మెంబర్ పాటి విలువ కూడా తమకు లేదని అధికార పార్టీలో అంతా వగచి వాపోతున్నారు. ఇక ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్‌, స‌ల‌హాదారుల ద‌గ్గర ఏ మాత్రం విలువ లేద‌న్నది వాస్త‌వం. క‌నీసం ఎమ్మెల్యేలు నాలుగు రాళ్లు వెన‌కేసుకునే ప‌రిస్థితి కూడా లేదు.

స్వేచ్ఛగా పనిచేసే….?

ఇక మంత్రుల తీరు కూడా అలాగే ఉంది. ఏపీలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో బాగా పనిచేసిన మంత్రులు ఎవరు అంటే ఏమీ జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. దాని కంటే ముందు మంత్రులు ఎవరో కూడా తమకు తెలియదు అన్నదే జనాల బాధ. తమ జిల్లా మంత్రులు ఎవరు, వారికి ఇచ్చిన శాఖలు ఏంటి అన్నది కూడా ప్రజలకు తెలియకపోతే ఇక వారు కుర్చీ ఎక్కి ప్రయోజనం ఏముంది. ఇక మంత్రులు కూడా చేసేందుకు పని లేకపోవడం జగన్ సర్కార్ లోనే చూస్తున్నారు అంతా. ఎందుకంటే మంత్రుల కంటే కూడా వేరే వ్యవస్థలను జగన్ నమ్ముకుంటున్నారు. వారే ఆయనకు దగ్గరగా ఉంటారు కూడా. ఇక కొంద‌రు స్వేచ్ఛగా త‌మ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే ప‌రిస్థితి లేదు.

భవిష్యత్ లేదని…..

ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి చాలు, మొత్తం మంత్రులు ఎందుకు అన్నట్లుగా వైసీపీలో సీన్ ఉంది. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరూ అనందంగా లేరన్న మాట ఉంది. అక్కడ ఎటూ పార్టీ ఓడింది కాబట్టి బాధ ఉండవచ్చు. కానీ రెండేళ్ళు అయినా పార్టీ ఎదగలేకపోతోంది. దాంతో పాటు అధినాయకత్వం పోకడలు అర్ధం కాక ఉన్న నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. పార్టీలో ద‌శాబ్దాలుగా ఉన్న నేత‌లే పార్టీకి భ‌విష్యత్తు లేద‌ని పార్టీని వీడుతున్నారు. పార్టీలో ఉన్న యువ‌నేత‌లు కూడా పార్టీకి భ‌విష్య‌త్తు లేద‌ని మ‌ద‌న‌ప‌డుతున్నారు.

పరాజయంతో….?

ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర‌ప‌రాభ‌వం వారితో మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇక ఆర్థికంగా కూడా టీడీపీ నేత‌లు ఇబ్బందుల్లో ఉండ‌డంతో ఖ‌ర్చు పెట్టలేని ప‌రిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందా అంటే ష్యూర్ గా చెప్పే పరిస్థితి అయితే టీడీపీలో లేదు. దాంతో పసుపు శిబిరం కూడా చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. మొత్తానికి వైసీపీ, టీడీపీ నేతలు డల్ గా ఉండటంతో ఏపీ రాజకీయం చప్పగా ఉంది మరి.

Tags:    

Similar News