చంద్రబాబుకు కూడా ఆ గండం ఉందా ?

దేశంలో ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందంగా ఉందన్నది అందరికీ తెలిసిన సంగతే. పేరుకు పార్టీలు కానీ అక్కడంతా ఏకస్వామ్యమే. ఒక వ్యకి చెప్పినదే శిలాశాసనంగా ఉంటుంది. నోరెత్తితే [more]

Update: 2020-08-29 15:30 GMT

దేశంలో ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందంగా ఉందన్నది అందరికీ తెలిసిన సంగతే. పేరుకు పార్టీలు కానీ అక్కడంతా ఏకస్వామ్యమే. ఒక వ్యకి చెప్పినదే శిలాశాసనంగా ఉంటుంది. నోరెత్తితే వేటు ఖాయం. ఇది దాదాపుగా దేశంలోని అన్ని పార్టీల్లోనూ ఉంది. నాయకులు తమ అభిప్రాయాలు స్వేచ్చగా పంచుకునే పరిస్థితి లేదు. దానికి తోడు కొన్ని కుటుంబాలు తన ఇల్లూ, భూములకు వారసత్వ హక్కు పొందినట్లుగా పార్టీల మీద కూడా పెత్తనం చేస్తున్నారు. దేశంలో అలాంటి చెడ్డ సంప్రదాయానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. ఆ తరువాత దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా కుటుంబాల చేతుల్లో చిక్కుకుని ఉన్నాయి.

సరైన ఝలక్ ….

దేశంలో కాంగ్రెస్ వయసు పెద్దది, 135 ఏళ్ల పార్టీ అది. ఇక గాంధీ నెహ్రూ వారసుల చేతుల్లో పడి సగానికి పైగా కాలం పార్టీ పగ్గాలు అక్కడే ఉండిపోయాయి. నిజానికి కాంగ్రెస్ లో ఉన్న వారిని సౌమ్యులు అనాలో, లేక వీర విధేయులు అనాలో తెలియదు కానీ ఇన్నాళ్ళూ కుటుంబ వారసత్వాన్ని నెత్తినెక్కించుకున్నారు. ఇపుడు మాత్రం కొంత ధిక్కార స్వరం బయటకు వచ్చింది. ఏకంగా 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం కావాలని ఎలుగెత్తి చాటారు. కాంగ్రెస్ పార్టీలో తమకూ వాటా ఉందని, అందరి చమట రక్తం ఆ పార్టీ ఆస్తిగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు, ఇది నిజంగా కాంగ్రెస్ కీ, దేశానికీ కొత్త రాజకీయ అనుభవమే.

బాబు వంతు….

ఇక కాంగ్రెస్ ఇపుడు చాలా తంటాలు పడుతోంది. ఎంత గింజుకున్నా గాంధీ నెహ్రూ వారసత్వం నుంచి బయటకు రాలేకపోతోంది. అదే విధంగా దేశంలో ఉన్న అనేక పార్టీలో కూడా ఇదే రకమైన అవస్థలు ఉన్నాయి. కాంగ్రెస్ స్పూర్తి పొందిన పార్టీలన్నీ ఈ ధిక్కార స్వరాన్ని భవిష్యత్తులో చూస్తాయని అన్న విశ్లేషణ సాగుతోంది. మరీ ముఖ్యంగా అధికారం లేకుండా నాయకత్వ లేమితో సతమవుతున్న తెలుగుదేశం లాంటి పార్టీలకు ఈ పరిణామాలు కలవరం కలిగించేవే. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ మొత్తం ఈ ఇద్దరి సొంతం. మిగిలిన వారు అంగుష్ట మాత్రులు. అయితే సాగినంత కాలం ఫరవాలేదు, కానీ ఇపుడు మాత్రం టీడీపీకి కూడా ముప్పు పొంచి ఉందని అంటున్నారు.

వద్దంటే రద్దే ….

టీడీపీని కూడా నమ్ముకుని సర్వం అర్పించిన వారు ఉన్నారు. ఇందులో కార్యకర్తలతో పాటు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇపుడు టీడీపీ కూడా దశ, దిశ లేకుండా ముందుకు సాగుతోంది. దాంతో టీడీపీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఎమ్మెల్యే వ‌ల్లభనేని వంశీ వంటి వారు చంద్రబాబును, లోకేష్ ని కడిగిపారేస్తున్నారు. పార్టీలో ఉన్న వారిలో కూడా చాలా మందికి ఈ రకమైన భావన ఉంది. కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. జాతీయ స్థాయిలో వస్తున్న పరిణామలను అర్ధం చేసుకుని టీడీపీ, బాబు సర్దుకోకపోతే తొందరలోనే పసుపు శిబిరంలోనూ ప్రళయ గర్జన వినిపీంచడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News