హిప్పీ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జాజ్బా సింగ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రద్ధా దాస్, సుదర్శన్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: నివాస్ ప్రసన్న సినిమాటోగ్రఫీ: [more]

Update: 2019-06-06 11:40 GMT

నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జేడీ చక్రవర్తి, జాజ్బా సింగ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రద్ధా దాస్, సుదర్శన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: నివాస్ ప్రసన్న
సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్
నిర్మాత: కలైపులి థాను
కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్: టి.ఎన్.కృష్ణ

RX 100 సినిమాతో యూత్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న కార్తికేయ ఒకే ఒక్క సినిమాతో అనుకోకుండా హీరో అయ్యాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై యూత్ కి బాగా కనెక్ట్ అయిన RX 100 తర్వాత కార్తికేయ మళ్ళీ యూత్ ని టార్గెట్ చేస్తూ తెలుగు తమిళంలో ఒకేసారి హిప్పీ మూవీ చేసాడు. టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హిప్పీ మూవీ లో నటించాడు. అయితే RX 100 క్రేజ్ తో హిప్పీ మూవీ బిజినెస్ మాత్రమే కాదు.. సినిమాపై అంతే అంచనాలు ఏర్పడ్డాయి. అందులోను హిప్పీ ట్రైలర్ లో కార్తికేయ 6 ప్యాక్ బాడీ, డిఫ్రెంట్ స్టయిల్ అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా మీద క్రేజ్ ఏర్పడింది. ఇక మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లోనూ హిప్పీ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగేలా చెయ్యగలిగింది హిప్పీ టీం. మరి మొదటి సినిమాతో అనుకోకుండా హీరో గా సెటిల్ అయిన కార్తికేయ ఈ హిప్పీ సినిమా డెఫ్ నెట్ గా హిట్ అవుతుందని బలంగా నమ్మడమే కాదు… హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు. మరి కార్తికేయ నమ్మకాన్ని హిప్పీ నిలబెట్టిందా.. లేదా. అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
దేవదాస్ (హిప్పీ) బాక్సర్‌గా ఉంటూ జేడీ చక్రవర్తి సాఫ్ట్ వేర్ కంపెనీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్నేహ (జబ్బా సింగ్) ప్రేమలో పడతాడు. ఆమెతో గోవాకి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లిన సందర్భంలో స్నేహ ఫ్రెండ్ ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవన్షీ)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు హిప్పీ. స్నేహ.. హప్పీ ప్రేమకోసం పరితపిస్తే.. హిప్పీ.. ఆముక్త మాల్యద లవ్‌లో పడేయడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో స్నేహ మరో వ్యక్తిని పెళ్లాడగా.. ఆముక్త మాల్యద ప్రేమను పొందుకున్న హిప్పీకి అసలు తిప్పలు మొదలౌతాయి. ఆ తిప్పల్ని భరించలేక తిరిగి ఆముక్త మాల్యదను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు హిప్పీ. అసలు హిప్పీ ఆముక్త మాల్యదని వదిలించుకుంటాడా? లేదంటే ఆముక్తనే హిప్పీ పెళ్లాడతాడా? అసలీ హిప్పీ లక్ష్యం ఏమిటి? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:
RX 100 సినిమాలో కార్తికేయ రావు రమేష్ ఎన్నికల్లో గెలిచినవేళ చొక్కా విప్పి ఓపెన్ టాప్ జీపులో డాన్స్ వేస్తూ హీరోయిన్ ని తెగ ఆకర్షిస్తాడు. ఇక ఇప్పుడు హిప్పీ సినిమాలోనూ కార్తికేయ పాటొచ్చినా, ఫైట్ వచ్చిన చొక్కా విప్పేసి 6 ప్యాక్ బాడీ ని చూపించేసాడు. కార్తికేయ 6 ప్యాక్ బాడీ తో ఆకట్టుకున్నాడు కానీ.. అన్నిసార్లు విప్పి చూపిస్తే చిరాకు కలుగుతుంది. ఇక నటనలో కార్తికేయ మొదటి సినిమా RX 100 లో బెటర్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. హిప్పీ లో కార్తికేయ చెప్పినట్టుగా మాత్రం లేదు.కాకపోతే కండలు పెంచడానికి గట్టిగానే కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్స్‌లో ప్లే బాయ్ అవతారంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. నాలుగు రకాల గెటప్స్‌లో వేరియేషన్స్ చూపించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన దిగంగన సూర్యవన్షీ అందం అభినయంతో ఆకట్టుకుంది. హీరో కార్తికేయ ను కావలసినట్టు ఆడుకునే అమ్మాయిగాను ఆకట్టుకుంది. ఇక సెకండ్ హీరోయిన్‌గా నటించిన జబ్బా సింగ్ బోల్డ్ పాత్రకే పరిమితం అయ్యింది. అందాలను ఆరబోసి రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం అయ్యింది. జెడి చక్రవర్తి సినిమా మొదటి నుండి చివరి వరకు తన పాత్ర పరిధిమేర ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో డైలాగ్‌ల కోసం బాగానే కష్టపడ్డాడు. వెన్నెల కిషోర్ కామెడీ రొటీన్‌గా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ హరితేజ క్యారెక్టర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిగతా నటీనటులు ఎంతకంతే అన్నట్టుగా ఉంది.

విశ్లేషణ:
దర్శకుడు టి.ఎన్.కృష్ణ.. ఈమధ్యన వచ్చిన ప్రేమ కథ చిత్రాలతో యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని లైన్ రాసుకున్నాడు. మరి ఈమధ్యన అన్ని సినిమాలు డైరెక్ట్ గా యూత్ నే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడో ఒక సినిమా కనెక్ట్ అవుతుంది. కానీ చాలా సినిమాలు మాత్రం యూత్ కి కనెక్ట్ అవడం అటుంచి అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. తాజాగా హిప్పీ సినిమా కథను కూడా దర్శకుడు టి.ఎన్.కృష్ణ యూత్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు. అయితే పాయింట్ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఇక లవ్ సీన్స్ కూడా ఏ సీన్ కి ఆ సీన్ కథ ప్రకారమే సాగుతున్న భావన కలిగినా ఓవరాల్ గా కథనం మాత్రం ముందుకు నడిపించవు. పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. దీనికి తోడు సినిమాలో అక్కడక్కడ బూతులు శృతిమించాయి. తొలి నుండి కథను స్లోగా నడిపిన దర్శకుడు క్లైమాక్స్‌లో సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్‌లు, మితిమీరిన శృంగార సన్నివేశాలను మిక్స్ చేసి యూత్‌కి మాత్రమే ఈ సినిమాని పరిమితం చేశారు. కానీ యూత్ కి కూడా ఈ సినిమా ఏ మాత్రం ఎక్కేది కనిపించడం లేదు. అలాగే కార్తికేయ చెప్పినట్టు హిప్పీ సినిమా సూపర్ హిట్ ఏమో కానీ.. అసలు యావరేజ్ హిట్ కూడా అయ్యేలా కనిపించడం లేదు.

ఈ సినిమా మ్యూజిక్ అందించిన నివాస్ ప్రసన్న సాంగ్స్‌తో మాత్రం పర్వాలేదనిపించారు. కాకపోతే భారంగా సాగుతున్న కథకు కొన్ని పాటలు అడ్డంగా తగిలాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ మోస్తరుగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కేఎల్ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌ని చాలా గ్లామరస్‌గా చూపించారు. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

రేటింగ్: 2.0/5

Tags:    

Similar News