Andhra : ఆ సామాజికవర్గాన్ని దూరం చేసుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కులాలే రాజకీయాల్లో గెలుపోటములను శాసిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో కులాల కంపు ఉన్నా ఏపీలో ఒకింత ఎక్కువనే చెప్పుకోవాలి. [more]

Update: 2021-09-28 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కులాలే రాజకీయాల్లో గెలుపోటములను శాసిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో కులాల కంపు ఉన్నా ఏపీలో ఒకింత ఎక్కువనే చెప్పుకోవాలి. ఏపీలో కమ్మ, రెడ్డి సామాజికవర్గం ఓట్ల శాతం తక్కువగా ఉన్నప్పటికీ రాజకీయాలను నడిపించేది ఆ రెండే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వారీగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి దానిని మరింత తీవ్రం చేశారు.

కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి….

ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఏపీలో బ్రాహ్మణ సామాజికవర్గం తక్కువే అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వారే కీలకం కానున్నారు. శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఇద్దరు ఛైర్మన్లు మారారు. ఈ సామాజికవర్గానికి ఏటా వందల కోట్లను వివిధ పథకాల రూపంలో సాయం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

చేరిస్తే తప్పేంటి.. బీసీల్లో చేర్చాలంటూ….

అయితే మెజారిటీ బ్రాహ్మణులు బీసీ కార్పొరేషన్లలో చేర్చడంపై పెద్దగా వ్యతిరేకం వ్యక్తం చేయడంలేదు. బ్రాహ్మణ సామాజికవర్గంలో పది నుంచి పదిహేను శాతం మాత్రమే ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్లిన వారి సంఖ్యతో కొంత శాతం మాత్రమే ఈ సామాజికవర్గంలో ఆర్థికంగా నిలదొక్కుకుంది. దాదాపు 85 శాతం మంది బ్రాహ్మణులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తొలి నుంచి బ్రాహ్మణ సామాజికవర్గం టీడీపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తూ వస్తుంది. గత ఎన్నికల్లోనూ వైసీపీకి మద్దతు ఇచ్చింది.

కొందరు మాత్రం….

బ్రాహ్మణ సామాజికవర్గాన్ని వెనకబడిన తరగతుల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో విన్పిస్తుంది. కానీ శారదాపీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ లో చేర్చడం ఏంటని, ప్రభుత్వాన్ని తాను నిలదీస్తానని చెబుతున్నారు. అయితే మెాజరిటీ ఆ సామాజికవర్గం ప్రజలు మాత్రం తమను ఎక్కడ చేర్చినా ఇబ్బంది లేదని, ఆర్థికంగా ఆదుకుని, సంక్షేమ పథకాలను తమకూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సయితం బీసీ కార్పొరేషన్ లో చేర్చడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, కార్పొరేషన్ ఏర్పాటు చేసిన లక్ష్యాలను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు.

Tags:    

Similar News