హైదరాబాద్ ఇప్పట్లో తెరుచుకోవడం కష్టమేనా?

హైదరాబాద్ లో కోటి జనాభా ఉంది. తొలి నుంచి భయపడుతున్నదంతా జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు హైదరాబాద్ లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. హైదరాబాద్ [more]

Update: 2020-04-25 16:30 GMT

హైదరాబాద్ లో కోటి జనాభా ఉంది. తొలి నుంచి భయపడుతున్నదంతా జరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు హైదరాబాద్ లోనే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. హైదరాబాద్ నగరం గత నెల నుంచి లాక్ డౌన్ లో ఉంది. కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నా వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉంటున్నాయి. ఎలాంటి వ్యాపారాలు జరగడం లేదు.

మే 7వ తేదీ తర్వాత కూడా…..

దీనికి తోడు లాక్ డౌన్ హైదరాబాద్ లో ఎప్పటి వరకూ ఉంటుందో క్లారిటీ లేదు. మే 7వ తేదీ వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ప్రస్తుతమున్న పరిస్థితిని చూస్తే పొడిగించే అవకాశాలున్నాయంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది ఆందోళన కల్గించే అంశమే. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం హైదరాబాద్ లో నే నమోదవుతున్నాయి.

అనేక ప్రాంతాల్లో రెడ్ జోన్…..

ఇప్పటికే హైదరాబాద్ లో అనేక ప్రాంతాలను కంటెయిన్ మెంట్ జోన్లుగా డిక్లేర్ చేశారు. దాదాపు వందకు పైగానే రెడ్ జోన్లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. అక్కడ లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రధానంగా పోలీసు భాషలో చెప్పాలంటే కరోనా వైరస్ ఎక్కువగా వెస్ట్ జోన్, సౌత్ జోన్ లలోనే కేసులు నమోదవుతున్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టింది ప్రభుత్వం.

ఇక్కడ కట్టడి చేయకుంటే….?

హైదరాబాద్ లో లాక్ డౌన్ ను తొలగిస్తే ఒక్కసారిగా జనం రోడ్లపైకి వస్తారు. సోషల్ డిస్టెన్స్ ను పాటించే అవకాశాలు కూడా తక్కువే. ఇప్పటికే ముంబయి నగరం కరోనాతో వణికిపోతుంది. హైదరాబాద్ లో తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పాలి. ఇక్కడ కంట్రోల్ చేయకుంటే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముంది.

Tags:    

Similar News