తిలా పాపం తలాపిడికెడు …?
చినుకు పడితే చాలు బస్తీవాసుల జీవనాలు ఛిద్రమైపోతున్నాయి. అలాంటిది వందేళ్లల్లో రెండోసారి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మాత్రం ఏమి తట్టుకోగలదు. ఫలితంగా 150 కి పైగా [more]
చినుకు పడితే చాలు బస్తీవాసుల జీవనాలు ఛిద్రమైపోతున్నాయి. అలాంటిది వందేళ్లల్లో రెండోసారి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మాత్రం ఏమి తట్టుకోగలదు. ఫలితంగా 150 కి పైగా [more]
చినుకు పడితే చాలు బస్తీవాసుల జీవనాలు ఛిద్రమైపోతున్నాయి. అలాంటిది వందేళ్లల్లో రెండోసారి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం మాత్రం ఏమి తట్టుకోగలదు. ఫలితంగా 150 కి పైగా ప్రాంతాలు నదులను తలపిస్తూ ఆస్తి ప్రాణ నష్టాలను మిగిల్చాయి. నిలువెల్లా స్వార్ధంతో ఆక్రమించిన నాలాలు, వాటిని కూల్చివేయాలిసిన అధికార గణాలు రాజకీయ నేతల జోక్యాల కారణంగా లంచాల వల్ల చూసి చూడనట్లు వదిలేయడంతో ఈ దుస్థితి దాపురించింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ లో ఇప్పుడు వర్షం పేరు చెబితే చాలు చిగురుటాకులా వణుకుతున్నారు ప్రజలు.
నష్టం అపారం …
వాయుగుండం కారణంగా మరో రెండు రోజులు హైదరాబాద్ కి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదే ఇప్పుడు అందరిలో మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. ఒక్కరోజు 30 సెంటీమీటర్ల కు పైగా పడిన భారీ వర్షానికి పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు వదిలారు. కొందరు విద్యుత్ షాక్ లతో కన్ను మూశారు. అనేక ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాల నష్టం ఇప్పటికిప్పుడు అంచనా కట్టలేనిది. ఇంతటి ఉపద్రవానికి ప్రకృతిని నిందించడం మాటెలా ఉన్నా మనిషి చేసుకున్న స్వయంకృతం అన్నది నిపుణులు తేలుస్తున్న అంశం. వివిధ శాఖల నడుమ అవగహన లేమి దీనికి తోడు అవుతుంది. రాబోయే విపత్తులను అంచనా వేసి డ్రైన్ల నిర్మాణం చేయకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.
జి హెచ్ ఎం సి కళ్ళు తీరుస్తుందా …?
హైదరాబాద్ అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు ఏ సర్కార్ అధికారంలో ఉన్నా ఖర్చు చేస్తున్నాయి. కానీ ఆ నిధులు ఎక్కువ భాగం ఖర్చు చేసేది సుందరీకరణకు మాత్రమే. డ్రైన్ల పై శ్రద్హ పెట్టి ఎప్పటికప్పుడు సిల్ట్ క్లిన్ చేయడం వంటి కార్యక్రమాలను జి హెచ్ ఎం సి ప్రణాళికా బద్దంగా చేపట్టడం లేదన్నది తాజా ఉపద్రవం రుజువు చేసింది. భాగ్యనగరం విశ్వ నగరం అంటూ ప్రచారం చేసుకోవడమే కానీ భారీ వర్షాలు సంభవిస్తే సిటీ హుస్సేన్ సాగర్ అయిపోతుందన్న చేదు నిజాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్ధం అవుతున్నాయి. ఆక్రమణల తొలగింపు, చెరువులకు వెళ్లే నీటి మార్గానికి అడ్డంకులు లేకుండా చూడటం ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. కోట్లాది మంది కొలువైన భాగ్యనగరం విశ్వ నగర ఖ్యాతి ఇనుమడించాలి అంటే దీర్ఘ కాలిక ప్రణాళికతో తెలంగాణ సర్కార్ యుద్ధప్రాతిపదికపై నడుం కట్టాలి.