డేంజర్ బెల్స్ మోగిస్తున్న హైదరాబాద్

వైరస్ మహమ్మారి కట్టడిలో లాక్ డౌన్ 3.0 వరకు బాగానే హైదరాబాద్ ఆ తరువాత సడలింపుల దెబ్బతో కేసుల సంఖ్య పెరిగిపోతూ డేంజర్ బెల్స్ మ్రోగిస్తుంది. అత్యధిక [more]

Update: 2020-06-01 11:00 GMT

వైరస్ మహమ్మారి కట్టడిలో లాక్ డౌన్ 3.0 వరకు బాగానే హైదరాబాద్ ఆ తరువాత సడలింపుల దెబ్బతో కేసుల సంఖ్య పెరిగిపోతూ డేంజర్ బెల్స్ మ్రోగిస్తుంది. అత్యధిక జనసాంద్రత కలిగిన మెగా సిటీస్ లో హైదేరాబద్ ఒకటి. ఇక్కడ వైరస్ ను కట్టడి చేయడం అంత సులువైన పని కాదు. ఒక పక్క వలస కూలీలు, మరోపక్క విమానాల రాకపోకల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో కరోనా పాజిటివ్ ల సంఖ్య పెరుగుతూ ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. వీటికి తోడు మొన్నటివరకు సర్కార్ సైతం ఎపి తో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే టెస్ట్ ల నిర్వహించడం తో కేసులు పెద్దగా బయట పడలేదు. కానీ ఇప్పుడు టెస్ట్ ల సంఖ్య ను టి సర్కార్ పెంచింది. కేసుల సంఖ్యా పెరిగిపోతుంది. రెండు వారాల్లో 500 ల కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో తేలుతుంది.

వైరస్ పై ప్రజల్లో చైతన్యం ఉన్నా నిర్లక్ష్యం …

ప్రపంచవ్యాప్తంగా వైరస్ పై అందరిలో అవగాహన పూర్తిస్థాయిలో ఉంది. ప్రభుత్వాలు, మీడియా ప్రజల్లో చైతన్యం బాగానే పెంచింది. అయితే అన్ని తెలిసినా మనకెందుకు వస్తుందిలే అనే నిర్లక్ష్యంతో ప్రజలు చేపడుతున్న కార్యక్రమాలు వైరస్ వ్యాప్తికి దారితీస్తున్నాయి. బర్త్ డే పార్టీలనుంచి, శుభ, అశుభ కార్యక్రమాలను గుట్టు చప్పుడు కాకుండా లాక్ డౌన్ నిబంధనలు పక్కన పెట్టి జరిపేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇటీవల అనేక పాజిటివ్ కేసులు ఫంక్షన్ ల కారణంగా వచ్చినవే కావడం గుర్తించాలిసిన అంశం. ఫలితంగా వైరస్ కట్టడి కత్తిమీద సామే అవుతుంది. ఇది వైద్యరంగంపై మరింత భారం పెరిగేలాగే చేస్తుంది.

ముందు జాగ్రత్తే మందు …

మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలి చావుల నిరోధానికి, ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించడం అంటే వైరస్ సమాజంలో లేదనుకునే రీతిలో జాగ్రత్తలు తీసుకోవడం నుంచి అన్ని అంశాల్లో జనం నిర్లిప్తత సమాజాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఇక వర్షాకాలం మొదలైపోతున్న నేపథ్యంలో వైరస్ కి తోడుగా మరికొన్ని అంటూ వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంది. దాంతో హైదరాబాద్ లో జూన్, జులై లో కేసుల సంఖ్య ఎలా ఉండబోతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొని ఉంది. దీనికి తోడు కేంద్రం లాక్ డౌన్ 5.0 లో ఇచ్చిన మరిన్ని సడలింపులతో అంతా పులిహోర అయిపోయేలాగే ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యతతో పౌరులు నడుచుకోవాలని సూచిస్తున్నారు. మరి అందరు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.

Tags:    

Similar News