సర్వేపల్లి సెంటిమెంట్ ఇద్దరిలో ఎవరికి?

ఏదైనా అతిగా తింటే చేదు అనిపిస్తుంది. వెగటు పుడుతుంది. రాజకీయాల్లోనూ అంతే. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనపై సహజంగా వ్యతిరేకత వస్తుంది. అనేక సార్లు రాజకీయాల్లో [more]

Update: 2021-10-03 13:30 GMT

ఏదైనా అతిగా తింటే చేదు అనిపిస్తుంది. వెగటు పుడుతుంది. రాజకీయాల్లోనూ అంతే. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనపై సహజంగా వ్యతిరేకత వస్తుంది. అనేక సార్లు రాజకీయాల్లో ఇది ప్రూవ్ అయింది. చంద్రబాబు, జగన్ వంటి పార్టీ అధినేతలను మినహాయిస్తే అతి తక్కువ మందికి వరస విజయాలు లభిస్తాయి. మామూలు నేతలకు రెండుసార్లు గెలిస్తే మూడోసారి గెలుపు కష్టమే. ఇది సెంటిమెంట్ గా వస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ని సెంటిమెంట్ వెంటాడుతుంది.

సోమిరెడ్డి రెండుసార్లు….

సర్వేపల్లి నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి అడ్డాగా ఉండేది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ రెండు సార్లు విజయం సాధించారు. 1999 తర్వాత ఆయనకు సర్వేపల్లిలో చివరి విజయం అయింది. 1994, 1999లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇక గెలుపు పిలుపు విన్పించలేదు. ఆయన రెండుసార్లు వరసగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని మిస్సయ్యారు.

ఆదాల కూడా మిస్….

1999 తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ లభించలేదు. 2004, 2009 వరస ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వరస విజయాలు సాధించారు. అయితే ఆయనకు 2014 ఎన్నికల్లో సర్వేపల్లి టీడీపీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని మిస్సయ్యారు. ఇక 2014లో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక కాకాణి వంతు….

2019 ఎన్నికల్లోనూ సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి విజయం సాధించారు. అంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి కాకాణి గోవర్థన్ రెడ్డి గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గం చరిత్ర చూస్తే ఎవరికీ హ్యాట్రిక్ విజయం దక్కలేదు. దీంతో ఇది సెంటిమెంట్ గా మారింది. అందుకే ఇటీవల కాలంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయంగా స్పీడ్ పెంచారంటున్నారు. మొత్తం మీద సర్వేపల్లి లో ఈ సెంటిమెంట్ కాకాణిని రాజకీయంగా ఎటువైపు తీసుకెళుతుందో చూడాలి.

Tags:    

Similar News