ఇద్దరి గేమ్ లో వారు బలి …? ఎపి లో జీతాలు ల్లేవ్
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు విచిత్ర పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ తరహాలోనే ఆర్ధిక షట్ డౌన్ ఎపి లో ఏర్పడింది. ఈ స్థితికి కారణం మీరంటే మీరంటూ అధికార [more]
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు విచిత్ర పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ తరహాలోనే ఆర్ధిక షట్ డౌన్ ఎపి లో ఏర్పడింది. ఈ స్థితికి కారణం మీరంటే మీరంటూ అధికార [more]
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు విచిత్ర పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ తరహాలోనే ఆర్ధిక షట్ డౌన్ ఎపి లో ఏర్పడింది. ఈ స్థితికి కారణం మీరంటే మీరంటూ అధికార విపక్షాలు దాడులు ప్రతిదాడులకు దిగాయి. మొత్తానికి ఒకటో తారీఖు జీతం అందుకునే సగటు ప్రభుత్వ ఉద్యోగి మరికొద్ది రోజులు ఆగాలిసిన దుస్థితిని రాజకీయాలు కల్పించాయి. వీరి బ్లేమ్ గేమ్ లో బలి అయ్యింది వేతన జీవులు కావడం గమనార్హం.
ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం లేకపోవడంతో …
మొన్నటి శాసన సభ సమావేశాల అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలి ఆమోదించాలిసి ఉంది. అయితే ఈ బిల్లుతో పాటు రాజధానుల తరలింపు, సీఆర్డీఏ బిల్లులను జగన్ సర్కార్ మండలికి పంపింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టాలని దాన్ని ఆమోదిస్తామని టిడిపి ప్రకటించింది. కానీ ప్రభుత్వం విపక్షం కోరినట్లు కాకుండా రివర్స్ లో వెళ్ళింది. యధావిధిగా మిగిలిన రెండు బిల్లులతో పాటు విపక్ష టిడిపి అడ్డు తగిలి సభను వాయిదా పడేలా చేసింది.
కొద్ది రోజులు ఆలస్యం అంతే …
ఈ నేపథ్యంలో బిల్లులు ఆమోదం పొందక పోయినా సాంకేతికంగా 14 రోజుల్లో ఆమోదం పొందినట్లే అవుతాయి. అయితే ఈ 14 రోజుల్లో ఒక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు చేసే వీలు లేదు. ఇప్పటికే ఆ సమయం పూర్తి అయ్యింది కనుక మరో రెండు రోజుల్లో లాంఛన ప్రకారం గవర్నర్ ఆమోదం తీసుకుని ఖజానా ను రీ ఓపెన్ చేసి జీతాల బట్వాడా మొదలు పెట్టొచ్చు. సాధారణ రోజుల్లో జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కరోనా కాలం కావడంతో వేతన జీవులు ఒక్కరోజు ఆలస్యం భరించలేని రోజులు. ఈ పరిస్థితుల్లో అటు అధికార ప్రతిపక్ష పార్టీలు చేసిన పనిని ఉద్యోగులు అంతర్గతంగా విమర్శిస్తున్నారు.
రోడ్డెక్కిన రెండు పక్షాలు ….
ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా చేయాలని టిడిపి కుట్ర పన్నిందంటూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శల దాడి మొదలు పెట్టారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు ఆయన. ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా టిడిపి అడుగడుగునా అడ్డు పడుతుందని విమర్శించారు కన్నబాబు.
మీదే తప్పు …
దీనికి ధీటుగా మాజీ మంత్రి యనమల స్పందించారు. మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చించి తొలుత ఆమోదించాలని చెప్పినా అధికారపక్షం రాజకీయం చేయాలనే ఆ ప్రయత్నం చేయలేదంటూ యనమల ధ్వజమెత్తారు. పాలన వ్యవహారాలపై పట్టులేకే ఈ దుస్థితికి అధికారపక్షం తీసుకువచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యనమల. ఆ బిల్లు ఆమోదించినా ఆమోదించకపోయినా 14 రోజుల గడువు ముగుస్తుందని దాంతో ఆమోదించినట్లే అవుతుందని జీతాలు చెల్లించలేకే ఈ అపవాదు తమపై నెడుతున్నారని ఆరోపించారు ఆయన. మొత్తానికి ఇరు పార్టీలు పంతాలకు పట్టింపులకు పోయి ఉద్యోగుల కు చేదు అనుభవాన్ని కొద్దిరోజులు మిగిల్చారు.