లాక్ డౌన్ లోనూ లిటిగేషన్లు ఏమిటి సామీ?
ప్రపంచం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఉన్నా మాకు రాజకీయాలే ముఖ్యమనే ధోరణిలో ప్రధాన ప్రతిపక్షం దూకుడుగా సాగడం విమర్శలకు దారితీస్తుంది. విపక్షం విమర్శలను అధికారపక్షం తిప్పికొడుతున్నా [more]
ప్రపంచం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఉన్నా మాకు రాజకీయాలే ముఖ్యమనే ధోరణిలో ప్రధాన ప్రతిపక్షం దూకుడుగా సాగడం విమర్శలకు దారితీస్తుంది. విపక్షం విమర్శలను అధికారపక్షం తిప్పికొడుతున్నా [more]
ప్రపంచం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఉన్నా మాకు రాజకీయాలే ముఖ్యమనే ధోరణిలో ప్రధాన ప్రతిపక్షం దూకుడుగా సాగడం విమర్శలకు దారితీస్తుంది. విపక్షం విమర్శలను అధికారపక్షం తిప్పికొడుతున్నా ఈ సమయంలో ఇదేమి ధోరణి అంటూ వాపోతుంది. సలహాలు సూచనలు ఇవ్వండి అని చెబితే ఇలా రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసిపి అంటుంది. కరోనా వైరస్ కట్టడి పై తీసుకుంటున్న చర్యల అప్ డేట్ తో పాటు పొలిటికల్ అప్ డేట్ కోసం అధికార విపక్షాలు తిట్ల దండకం మొదలు పెట్టేస్తున్నాయి. ఎవరు ఏమి అనుకున్నా మా రాజకీయాలు మావే అన్న తీరు మాత్రం విమర్శలకు తెరతీసింది.
ఆ క్రెడిట్ మాదే …
తాజాగా విశాఖ మెడిటెక్ కేంద్రంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ కిట్స్ , వెంటిలేటర్ ల తయారీకి ఎపి సర్కార్ భారీ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వీటితో పాటు పిపిఈ ల తయారీ కూడా త్వరలో ఏపీ లోనే ఉత్పత్తి చేసే ప్రయత్నాలు మొదలు కానున్నాయి. వీటికి జగన్ ఒకే చెప్పేశారు కూడా. దాంతో ఇవన్నీ ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి రానుండటంతో ఆంధ్రప్రదేశ్ తన అవసరాలు తీర్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా వీటిని అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్యలను అభినందించాలిసిన విపక్షం ఒక్కసారిగా అధికారపక్షంపై దాడి మొదలు పెట్టింది. ఇక నర్సీపట్నం వైద్యుడి వ్యవహారం పైనా రాజకీయ దుమారం అధికారవిపక్షాల్లో చెలరేగిపోతుంది.
ఆరోపణలతో హీటెక్కిన ఏపీ….
మెడిటెక్ చంద్రబాబు ఆలోచనే అని, దీనిని గతంలో విమర్శించి విచారణ కూడా చేయించిన వైసిపి అదేదో తమ ఘనతే అని చెప్పుకుంటుందంటూ విమర్శలు స్టార్ట్ చేసేసింది టీడీపీ. దీనిపై అధికారపార్టీ సైతం ఎదురుదాడి చేయక తప్పలేదు. ఇప్పుడేంటి బాబు రాజకీయాలు అంటూ టిడిపి గోలకు సమాధానం చెప్పింది. అయితే క్రెడిట్ ల కోసం పాకులాడే సమయమా ఇది? కనీసం లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు కూడా ఎపి లో రాజకీయాలు ఆగవా? అన్నది జనం ప్రశ్న గా మిగిలింది. మోడీ దేశంలో రాజకీయాలపై కూడా లాక్ డౌన్ విధిస్తే మంచిదన్న టాక్ పెరిగింది.