గోస్వామి… ఇక మీరే దిక్కు?
రాజకీయ పార్టీ అన్న తరువాత ఎన్నో ఆలోచనలు ఆశలు ఉంటాయి. అలాగే అంచనాలు కూడా చాలానే ఉంటాయి. మంచికో చెడుకో ఒక విధానం అనుకున్నాక ముందుకు పోవడమే [more]
రాజకీయ పార్టీ అన్న తరువాత ఎన్నో ఆలోచనలు ఆశలు ఉంటాయి. అలాగే అంచనాలు కూడా చాలానే ఉంటాయి. మంచికో చెడుకో ఒక విధానం అనుకున్నాక ముందుకు పోవడమే [more]
రాజకీయ పార్టీ అన్న తరువాత ఎన్నో ఆలోచనలు ఆశలు ఉంటాయి. అలాగే అంచనాలు కూడా చాలానే ఉంటాయి. మంచికో చెడుకో ఒక విధానం అనుకున్నాక ముందుకు పోవడమే రాజకీయ పార్టీల తీరుగా ఉంటుంది. వైసీపీ పెద్దల విషయానికి వస్తే ఎన్నికల వేళ చెప్పలేదు కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం అమరావతి రాజధాని మీద శీత కన్ను వేశారు. మెల్లగా ఆరు నెలల తరువాత మూడు రాజధానులు అంటూ నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ అతి పెద్ద బాంబు పేల్చారు. ఆ ప్రకంపనలతోనే 2020 ఏడాది అంతా అలా సాగిపోయింది.
మంచి రోజులేనా…?
ఇక ఈ మధ్యన చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇక న్యాయ వ్యవస్థను కూడా ఒక దశలో లాగారు. ఏది ఎలా ఉన్నా అన్నీ మారాయి. మారుతున్నాయి.దాంతో తమకు తగిన న్యాయం దక్కుతుందని వైసీపీ నేతలలో నిండు అయిన ధీమా ఇపుడు కనిపిస్తోంది. జగన్ కి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో అయితే మరో నాలుగు నెలలలో విశాఖకు పరిపాలనా రాజధాని తరలివెళ్లడం ఖాయమని చెప్పేశారు. అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది అంటూ ఆయన అనడం కొస మెరుపుగా చూడాలి.
న్యాయం జరిగేనా..?
మూడు రాజధానుల మీద ఇపుడు హై కోర్టులో వివాదం నడుస్తోంది. విచారణ కీలకదశలో ఉండగానే ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి బదిలీ మీద వెళ్లారు. ఇపుడు కొత్త ప్రధాన న్యాయ మూర్తిగా గోస్వామి వచ్చారు. ఆయన చేపట్టాల్సిన కీలకమైన కేసులలో అతి ముఖ్యమైనది మూడు రాజధానుల కేసు కూడా ఉంది. మరి దీని విచారణ మొదటి నుంచి జరుగుతుందా లేక గత విచారణను కొనసాగిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా నాలుగు నెలలలో ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. వైసీపీ నేతలు అయితే తమ మూడు రాజధానుల వాదనకు న్యాయం జరుగుతుంది అని గట్టి వైసీపీవిశ్వాసంతో ఉన్నారు మరి.
ఇక ఇబ్బందే…?
ఇప్పటిదాకా చూసుకుంటే అనేక కేసులలో అధికార పార్టీకి న్యాయ స్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలేవి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వ్యవహారంలో మాత్రం తొలిసారిగా ప్రభుత్వ వాదనకు బలం చేకూరేలా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో విపక్షాలకు మరీ ముఖ్యంగా టీడీపీకి దిమ్మతిరిగినట్లు అయింది. వైసీపీ సర్కార్ కి గత ఏడాది నుంచి ఇబ్బంది గా ఉన్న కొన్ని కేసులలో కీలకమైన తీర్పులు ఈ ఏడాది రానున్నాయి. అయితే ఇదే ఊపులో న్యాయం తప్పకుండా తమకు లభిస్తుందని వైసీపీ పెద్దలు నమ్మకంగా ఉన్నారు. అదే కనుక జరిగితే మాత్రం టీడీపీకి పెద్ద చిక్కులే ఎదురవుతాయి అంటున్నారు. ఏది ఏమైనా రోజులన్నీ ఒక్కలా ఉండవు. క్యాలండర్ కూడా మారింది. మరి టీడీపీ కూడా కొత్త ముచ్చట్లు మరెన్నో చవి చూడాల్సి ఉంటుందేమో.