మరోసారి లాక్ డౌన్ తప్పదా? మినహాయింపులు తీసేస్తారా?

భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే మూడు లక్షలు దాటిన కరోనా కేసులతో జులై నాటికి పదిహేను లక్షలకు చేరువవుతాయన్న నిపుణుల హెచ్చరికతో [more]

Update: 2020-06-14 16:30 GMT

భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే మూడు లక్షలు దాటిన కరోనా కేసులతో జులై నాటికి పదిహేను లక్షలకు చేరువవుతాయన్న నిపుణుల హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధాని నరేంద్రమోదీ సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. లాక్ డౌన్ మినహాయింపులు, కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై మంత్రులు సయితం ఆందోళన వ్యక్తం చేశారు.

ఐదు రాష్ట్రాల్లో…..

ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఆగడం లేదు. మహారాష్ట్రలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండంతో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ప్రధానంగా కమ్యునిటీ వ్యాప్తి ఉందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలాగే కొనసాగిస్తే రానున్న మూడు నెలల కాలం గడ్డు కాలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత?

ీఈ నేపథ్యంలో ఈ నెల 16, 17వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ మినహాయింపులతోనే కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. మిజోరాం మళ్లీ లాక్ డౌన్ వైపు వెళ్లింది. దీంతో ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తారా? లేక మరో ప్రత్యామ్నాయం చూస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News