కరోనా దెబ్బకు ట్రెండ్ మార్చేశారుగా?

ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాల్లో భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో రాజకీయ రంగంలోనూ ఆధునిక సాంకేతికత బాగానే వినియోగిస్తున్నారు. వైరస్ వచ్చినప్పటినుంచి [more]

Update: 2020-06-26 09:30 GMT

ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాల్లో భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో రాజకీయ రంగంలోనూ ఆధునిక సాంకేతికత బాగానే వినియోగిస్తున్నారు. వైరస్ వచ్చినప్పటినుంచి భారత ప్రధాని మోడీ ముఖ్యమంత్రులనుంచి అందరి తో ఇప్పటికే వర్చ్యువల్ సమావేశాలు నిర్వహిస్తూ కొత్తదారి చూపించారు. ఇదే బాటలో ముఖ్యమంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎపి లో గవర్నర్ అసెంబ్లీలో చేయాలిసిన ప్రసంగం వర్చ్యువల్ గా చేసి కొత్త సంప్రదాయానికి నాంది పలకడం తెలిసిందే.

టిడిపి మహానాడు సైతం …

తెలుగుదేశం పార్టీ ఈ ట్రెండ్ లో బాగా ముందు ఉంది. లాక్ డౌన్ లో హైదరాబాద్ లో చిక్కుకున్న చంద్రబాబు పార్టీని ఆన్ లైన్ లో నడిపించడమే కాదు అధికారపక్షానికి నిద్ర లేకుండా చేశారు. అంతే కాదు టిడిపి నిర్వహించే మహానాడు సైతం వర్చ్యువల్ గా నిర్వహించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇప్పుడు కూడా ఆయన ముఖ్య నేతలు, కార్యకర్తలతో వీడియో కాన్ఫెరెన్స్ ల ద్వారా గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తూ టెక్నాలజీ ని పూర్తి గా వాడేస్తున్నారు.

ఎపి సిఎం సైతం …

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం వర్చ్యువల్ సమావేశాల్లో యమా బిజీగా పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆయన ఆన్ లైన్ ద్వారా ప్రజలకు చేరువ చేసేలాగే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల టూరిజం కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు ప్రారంభోత్సవాలు అన్ని వర్చ్యువల్ గా నిర్వహించడం గమనార్హం. కరోనా ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను సైతం ఆన్లైన్ ద్వారా పూర్తి అయ్యేలా సర్కార్ వేగవంతంగా చర్యలు చేపట్టింది. దేశంలోనే టెలి మెడిసిన్ వినియోగంపై జగన్ ప్రభుత్వమే ప్రయోగాలు ముందుగా మొదలు పెట్టి ప్రశంసలు సైతం అందుకుంది.

తెలంగాణలోనూ అదే ట్రెండ్ …

ఇప్పుడు తెలంగాణ లో పార్టీల సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని వర్చ్యువల్ గానే నడుస్తున్నాయి. ఇక పోతే కెసిఆర్ సర్కార్ పై నిత్యం పోరు సల్పేందుకు సైతం బిజెపి వర్చ్యువల్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి చర్చనీయంగా మారింది. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు ఉండాలి అంటే తిరగాలిసి ఉంది. అయితే వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇది సరైన పద్ధతి కాదని భావించి వర్చ్యువల్ ర్యాలీలు సభలు చేపట్టింది కాషాయదళం.

రాబోయే రోజుల్లో ఇదే పద్ధతి …

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజు కు బాగా పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ పై ఆంక్షలు సడలింపులు ఎన్ని ఇచ్చినా ఇప్పట్లో సభలు, సమావేశాలకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవొచ్చు. ఈ నేపథ్యంలో అప్పటివరకు రాజకీయ పార్టీలు చేతులు కట్టుకుని ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండదు. అలా చేస్తే అధికారపార్టీలకు అడ్వాంటేజ్ ఇచ్చిన వారు అవుతారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ఎక్కితే వారికి రెండు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఒకటి ఆయా ప్రభుత్వాలు పెట్టె కేసులు, మరోపక్క వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటాయి. ఈ నేపథ్యంలో వర్చ్యువల్ ఉద్యమాలతో ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకోక తప్పని వాతావరణం ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉంది. ఆన్లైన్లో విద్యా బోధన సాగుతున్నట్లే ఈ విధానంపై నేతలు, కార్యకర్తల్లో బాగా అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు.

Tags:    

Similar News