భారత్, ఆసీస్ లకే కప్ ఛాన్స్ అంటున్నారే ?

సుదీర్ఘ వరల్డ్ కప్ సమరం తుది దశకు చేరుకుంది. సెమిస్ లో తలపడే ది ఎవరో తేలిపోయింది. తన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా [more]

Update: 2019-07-07 01:37 GMT

సుదీర్ఘ వరల్డ్ కప్ సమరం తుది దశకు చేరుకుంది. సెమిస్ లో తలపడే ది ఎవరో తేలిపోయింది. తన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా పరాజయం, శ్రీలంక పై అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో టీం ఇండియా నెంబర్ వన్ గా నిలిచి నాలుగోస్థానంలో వున్న న్యూజిలాండ్ తో సెమిస్ ఆడనుంది. ఇక పాయింట్ల పట్టికలో తొలి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన కంగారూలు సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్ కి రెండో స్థానానికి పడిపోయి మూడోస్థానంలో వున్న ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఆధ్యంతం ఉత్కంఠభరితం గా సాగిన టోర్నీ లో పది టీం లలో నాలుగు టీం లు ప్రతిష్టాత్మక సెమిఫైనల్ బెర్త్ దక్కించుకున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తమ సత్తా చాటాయి. ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఇండియా – న్యూజిలాండ్ నడుమ ఈనెల 9 న ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ నడుమ ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెమిస్ సమరం ఈనెల 11 న సాగనుంది.

వీరిద్దరికి అద్భుత రికార్డ్ వుంది…

వరల్డ్ కప్ ఆరంభం నుంచి ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయి వర్షం వల్ల న్యూజిలాండ్ తో మ్యాచ్ రద్దు అయిన టీం ఇండియా అద్భుత ప్రతిభను ఫామ్ ను కొనసాగిస్తూ వచ్చింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ తప్ప అందరిపైనా దుమ్మురేపిన కోహ్లీ సేనకు కప్ కొట్టే ఛాన్స్ బాగానే ఉందంటున్నారు క్రీడా పండితులు. ఇక ఆస్ట్రేలియా సైతం ఆడిన 9 మ్యాచ్ లకు 7 గెలిచి రెండో స్థానం లో వుంది. భారత్, దక్షిణాఫ్రికాలపై ఓటమి చవిచూసిన ఆసీస్ కి ట్రాక్ రికార్డ్ పరంగా కానీ ప్రస్తుతం ఆ టీం ఫామ్ పరంగా కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసిస్ సైతం కప్ ఇండియా – ఆస్ట్రేలియా నడుమే ఉండొచ్చని భావిస్తున్నాడు. ఇక టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ ప్రత్యర్థి ఎవరైనది తమకు అవసరం లేదని బరిలో రాణించి ఫైనల్ చేరడమే లక్ష్యం అని చెబుతున్నాడు.1983 లో కపిల్ డెవిల్స్ 2011 లో ధోని సేన ప్రపంచకప్ ను సగర్వంగా భారత్ కి తెచ్చిపెట్టారు. ఇప్పుడు కోహ్లీ సేన వారి సరసన నిలవాలని తీవ్రంగా కృషి చేస్తుంది. మరో పక్క వరల్డ్ కప్ లీగ్ చివరి మ్యాచ్ లో ఓటమి ఆసీస్ లో కసి రేపింది. సెమిస్ లో ఇంగ్లాండ్ ను చిత్తుచేసేందుకు కంగారులు సిద్ధం అయిపోయారు.

అచ్చిరాని కప్ ….

క్రికెట్ కి పుట్టినిల్లయిన పేరు తప్ప ఒక్కసారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ను అందుకోలేకపోయింది ఇంగ్లాండ్. ఎన్నోసార్లు సాధిస్తుంది అనుకున్న సమయంలో ఇంగ్లీష్ టీం చతికిలబడి ఆ దేశ క్రీడాభిమానులను నిరాశపరుస్తూనే వచ్చింది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ లో అయినా ఈ ముచ్చట తీరుస్తారేమో అని ఆ టీం పై గంపెడాశ పెట్టుకున్నారు అభిమానులు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టి మధ్యలో చతికిల పడి తిరిగి లేచి చివరి అంకంలో విజృంభించి ఎట్టకేలకు సెమిస్ కి చేరింది ఆతిధ్య ఇంగ్లాండ్. ఇప్పుడు తన చిరకాల ప్రత్యర్థి ఆసీస్ తో అమీతుమీకి సిద్ధమైంది. ఇక న్యూజిలాండ్ కి వరల్డ్ కప్ అచ్చిరాలేదనే చెప్పాలి. ప్రతీసారి సెమిస్ వరకు అద్భుత ఆటతీరుతో రాణించి అక్కడ ప్రత్యర్థి చేతిలో భంగపాటు ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది. తొలిసారి ఫైనల్ చేరుకొని కప్ ఎత్తుకుపోవాలని ఆ టీం తహతహలాడుతోంది. చూడాలి మరి ఎవరు అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులో.

Tags:    

Similar News