Huzurabad : కాంగ్రెస్ ఓట్లన్నీ ఆ పార్టీకేనట… నిజమేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈసారి ఎటువైపు టర్న్ అవుతుందన్నది ప్రశ్నగా [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈసారి ఎటువైపు టర్న్ అవుతుందన్నది ప్రశ్నగా [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈసారి ఎటువైపు టర్న్ అవుతుందన్నది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టింది. బెల్మూరు వెంకటేష్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్ఎస్క్ష్క్ష్యూఐ అధ్యక్షుడి గా ఉన్న ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ కు ఇక్కడ గెలిచే అవకాశాలే లేవు. ఆ సంగతి ఆ పార్టీ నేతలకూ తెలుసు.
కాంగ్రెస్ ఓట్లు….
కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏ పార్టీకి తరలి వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 1,10,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి 61,730 ఓట్లు వచ్చాయి. దాదాపు నలభై వేల ఓట్ల తేడాతో ఈటల రాజేందర్ నాటి ఎన్నికల్లో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీికి డిపాజిట్లు కూడా దక్కలేదు.
తొలి నుంచి సీరియస్ గా….
హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ తొలి నుంచి సీరియస్ గా లేదు. ఆ ఎన్నిక తమకు అనవసరం అన్నట్లుగానే వ్యవహరించింది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం చేసింది. టీఆర్ఎస్ , బీజేపీ మూడు నెలల ముందుగానే ప్రచారం ప్రారంభిస్తే కాంగ్రెస్ నామినేషన్ తర్వాత కాని కదలలేదు. దీంతో గత ఎన్నికల్లో వచ్చిన 60 వేల ఓట్లు ఇప్పుడు టర్న్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎటూ గెలవరని భావించి ఓటు వృధా చేసుకోరని, టీఆర్ఎస్, బీజేపీలలో ఒకరికి ఓటు వేస్తారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
ఆ ఓట్లు తమకేనంటూ….
అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు గత ఎన్నికల్లో పడిన ఓట్లలో కొన్నింటినైనా తమ వైపు వస్తాయని టీఆర్ఎస్ భావిస్తుంది. అయితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఈసారి ఈటల రాజేందర్ కు వేస్తారని, కాంగ్రెస్ ఎటూ గెలవదని, ఈటలకు వేయడమే బెటరని ఆ సామాజికవర్గం ఓటర్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి సామాజికవర్గం కావడంతో ఈ వాదన వినపడుతుంది. మొత్తం మీద ఆ ఓట్లు ఎటు మళ్లితే వారిదే విజయమన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.