Congress : హుజూరాబాద్ తో కాంగ్రెస్ అన్ని రకాలుగా నష్టమేనా?

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మరో అవకాశం హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ [more]

Update: 2021-10-28 11:00 GMT

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మరో అవకాశం హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకూ అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో మారోసారి ఈ వాదన బలపర్చుకునేందుకు బీజేపీ సిద్దమయిందనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఇక్కడ నామమాత్రమే.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం…?

ఇదే కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. తెలంగాణలో బీజేపీ పార్లమెంటు ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వంటివి బీజేపీ బూస్టప్ ఇచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు గెలుచుకోవడం, దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఢీకొట్టి విజయకేతనం ఎగురవేయడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా కార్పొరేటర్లను గెలుచుకోవడం ఆ పార్టీ తానే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే స్థితికి తీసుకువచ్చాయి.

ప్రతి ఎన్నికల్లో….

మరోవైపు కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒకస్థానంలో గెలిచింది. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడుతున్నారు. ఈ సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది.

బీజేపీ గెలిస్తే….?

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ది మూడో స్థానమే. నిజానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాకుంటే కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇచ్చి ఉండేది. ఇప్పుడు హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు నష్టమేనని చెప్పాలి. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పెద్దగా కాంగ్రెస్ నష్టపోయే అవకాశం లేదు. అందుకే వీలయినంతగా బీజేపీ విజయం సాధించకుండా ఉండేందుకే కాంగ్రెస్ పోరాడాల్సి ఉంటుంది. లేకుంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News