Congress : హుజూరాబాద్ ఫలితం బేజారేత్తించనుందా?
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఇక్కడ పార్టీకి కనీస ఓట్లు వచ్చే అవకాశాలున్నాయా? అన్నదీ సందేహమే. ఎందుకంటే తొలి నుంచి [more]
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఇక్కడ పార్టీకి కనీస ఓట్లు వచ్చే అవకాశాలున్నాయా? అన్నదీ సందేహమే. ఎందుకంటే తొలి నుంచి [more]
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఇక్కడ పార్టీకి కనీస ఓట్లు వచ్చే అవకాశాలున్నాయా? అన్నదీ సందేహమే. ఎందుకంటే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికను అసలు సీరియస్ గా తీసుకోలేదు. అభ్యర్థి ప్రకటనపైనే నెలలు తరబడి నాన్చింది. కొండాసురేఖను పోటీ చేయాలనుకుంది. చివరి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇవ్వడంతో అప్పటికప్పుడు ఎన్ఎస్‍యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను బరిలోకి దింపింది.
ఈటల రాజీనామా తర్వాత….
ఈటల రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకసారి రాజీనామాను స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం. ఈ సంగతి తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు అభ్యర్థి ఎంపికపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఏదో ఒక కమిటీని నియమించి షో చేశారు తప్పించి సీరియస్ గా అభ్యర్థిని ఎంపిక చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న ప్రయత్నం చేయలేదన్న విమర్శలు బాగానే విన్పించాయి.
బలహీనమైన నేతను….
నిజానికి ఈటల రాజేందర్ గెలవాలని కాంగ్రెస్ కూడా భావించింది. అధికార టీఆర్ఎస్ ను కట్టడి చేయాలంటే ఈటల గెలుపు అవసరమని భావించింది. అందుకే అక్కడ బలమైన నేత కౌశిక్ రెడ్డి ఉన్నప్పటికీ అతనికి కావాలనే పొగపెట్టారన్న విమర్శలు కూడా లేకపోలేదు. కౌశిక్ రెడ్డి పార్టీని వీడటంతో అక్కడ కాంగ్రెస్ మరింత బలహీనపడింది. దీంతో అభ్యర్థి ఎంపికలోనూ పెద్దగా ఆలోచించలేదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
ఓట్లను బట్టే….?
ఎన్నికలకు ముందే బీజేపీ అభ్యర్థితో కాంగ్రెస్ కుమ్మక్కయిందని కేటీఆర్ సయితం ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒక ఫాంహౌస్ లో కలిశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. హుజూరాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు దాదాపు 60 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి అన్ని ఓట్లు వచ్చే పరిస్థిితి లేదు. డిపాజిట్ దక్కుతుందా? అన్న డౌట్ ను కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత డ్యామేజీ అయ్యే అవకాశాలున్నాయి.