Congress : ఆ రూట్లో వెళితే తప్ప గెలుపు దక్కదట
తెలంగాణలో కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుంది? ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్లు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటారు. రేవంత్ [more]
తెలంగాణలో కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుంది? ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్లు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటారు. రేవంత్ [more]
తెలంగాణలో కాంగ్రెస్ ఎలా బలోపేతం అవుతుంది? ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్లు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం ఇప్పటికే వరసగా రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించలేదు. టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. తెలంగాణను రిస్క్ తీసుకుని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు.
ప్రజల్లో నమ్మకం కోల్పోయి….
రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టారు. బలమైన నేతలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ నేతలను విశ్వసించాల్సి ఉంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించినా అనంతరం వారు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ కు వేయడం కంటే టీఆర్ఎస్ కే ఓటు వేయడం ఉత్తమం కదా? అన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. నమ్మకమైన నేతలే కాంగ్రెస్ ను వీడిపోవడంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
కొత్త తరానికే….
అందుకే కొత్త నేతలకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. చాలా నియోజకవర్గాల్లో యువ నేతలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ నేతల వెనక ఉండి రాజకీయాలను చూస్తు వస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రేవంత్ రెడ్డి రాకతో యువనేతల్లో ఆశలు పెరిగాయి. దీనిపై పూర్తి స్థాయి అథ్యయనం చేయడానికి రేవంత్ రెడ్డి సర్వే కూడా చేయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.
పాత నేతలను పక్కన పెట్టి….
ఏళ్లుగా పోటీ చేస్తూ ఓటమి పాలయిన నేతలను పక్కన పెట్టి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే ఈ ప్రక్రియను మొదలు పెడితే సక్సెస్ అవుతామని రేవంత్ భావిస్తున్నారు. ఇప్పటికే తన ఆలోచనను అధిష్టానం ముందు పెట్టినట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే సీనియర్లకు వివిధ రూపంలో పదవులు దక్కుతాయని, వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని పార్టీ విజయానికి సహకరించాలని కాంగ్రెస్ హైకమాండ్ తో చెప్పించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అలా అయితేనే పార్టీకి విజయావకాశాలు న్నాయని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది.