ఏపీలో కొత్త ఐడియా… ఉపయోగపడే విధంగా?

ఆర్టీసీ లో ఇంద్రా బస్సులు ఇప్పుడు సంజీవినిగా మారిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడికి జగన్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది. దేశంలో అత్యధిక టెస్ట్ లు చేస్తున్న [more]

Update: 2020-07-10 11:00 GMT

ఆర్టీసీ లో ఇంద్రా బస్సులు ఇప్పుడు సంజీవినిగా మారిపోయాయి. కరోనా మహమ్మారి కట్టడికి జగన్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుంది. దేశంలో అత్యధిక టెస్ట్ లు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఈ టెస్ట్ లను మరింత వేగంగా చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా ఇప్పుడు డిపో లకే పరిమితమైన ఆర్టీసీ ఇంద్రా ఎసి బస్సులను ఆధునీకరించి సంచార ల్యాబ్ లుగా తయారు చేసింది. ప్రతి జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున పంపి టెస్ట్ ల సంఖ్యను మరింతగా పెంచడానికి సన్నాహాలు చేస్తుంది.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి …

ఇప్పటికే ఎపి లో కరోనా పరీక్షలు ఉచితంగా నే చేస్తున్నారు. భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని భావించి వైరస్ సోకితే చికిత్స కు మాత్రం ప్రయివేట్ కి పచ్చ జండా ఊపేసింది. అయినప్పటికి ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా ట్రీట్మెంట్ చేర్చింది ప్రభుత్వం. దాంతో తెలంగాణ కన్నా ఎపి లో జగన్ సర్కార్ వైద్యం అంశంలో ప్రజల మన్ననలు అందుకుంటుంది.

త్వరలో సంచార జనతా బజార్లు …

పోను పోను కరోనా పెరుగుతుందే కానీ కట్టడి కావడం లేదు. ఈ నేపథ్యంలో మహమ్మారి తో సహజీవనం నేపథ్యంలో ఆర్టీసీ ని పలు రకాలుగా వినియోగించుకుంటుంది ప్రభుత్వం. సరకు రవాణాకు బస్సులను సిద్ధం చేసింది. అదే విధంగా జనతా సంచార బజార్లు అనే కాన్సెప్ట్ లో ప్రతి కూడళ్లలో కూరగాయలు నిత్యావసరాలు విక్రయించేందుకు కొత్త తరహాలో బస్సుల ను తయారు చేస్తున్నారు. దీనివల్ల ధరలు కొండ ఎక్కకుండా ఉండటంతో పాటు నిత్యావసరాలు ప్రజల ముంగిటకు రానున్నాయి. వైరస్ కట్టడికి ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం జగన్ సర్కార్ అన్వేషిస్తున్న నేపథ్యంలోనే సుదీర్ఘ కార్యాచరణ తీసుకోవడం విశేషం.

Tags:    

Similar News